Karthika Pournami: కార్తిక పౌర్ణ‌మి నాడు ఏం చేస్తే మంచిది?

Karthika Pournami: నేడే కార్తిక పౌర్ణ‌మి. కార్తిక పౌర్ణ‌మిని దేవ దీపావ‌ళి, త్రిపురి పౌర్ణ‌మి అని కూడా అంటారు. హిందువుల‌కు, సిక్కుల‌కు, జైనుల‌కు ఇది ఎంతో ప‌విత్ర‌మైన ప‌ర్వ‌దినం. పురాణాల ప్ర‌కారం ఇదే రోజున‌ శివ‌య్య ఒక్క బాణంతో రాక్ష‌సుల‌ను అంత‌మొందించాడ‌ట‌. పౌర్ణ‌మి తిథి 26న మ‌ధ్యాహ్నం 3:53 గంట‌లకు మొద‌ల‌వుతుంది. ఈ స‌మ‌యం నుంచి మ‌రుస‌టి రోజు మ‌ధ్యాహ్నం 02:45 వ‌ర‌కు ఎప్పుడైనా దీపారాధ‌న చేసుకోవ‌చ్చు.

సాయంత్రం స‌మ‌యంలో ఇల్లంతా దీపాలు పెడితే ఎంతో మంచిది. ముఖ్యంగా ఉసిరి, రావి, వేప చెట్లు వ‌ద్ద ఉసిరి కాయ‌ల‌పై ఆవు నెయ్యితో దీపాల‌ను వెలిగిస్తే కోటి జ‌న్మ‌ల పుణ్యం ల‌భిస్తుంది. శివాల‌యాల‌కు వెళ్లినా… స్వామి వారికి అభిషేకం చేయించినా స‌క‌ల సంప‌ద‌లు క‌లుగుతాయి. వివాహం అయిన అమ్మాయిలు ప‌సుపు, కుంకుమ‌, పూలు, తాంబూలాల‌తో పాటు కార్తీక పురాణ పుస్త‌కాల‌ను దానంగా ఇస్తే ఎంతో మంచిది. వీలైతే న‌దిలో స్నానం ఆచ‌రించేందుకు ప్రయ‌త్నించండి. న‌దులు అందుబాటులో లేక‌పోతే కొల‌ను, చెరువుల ద‌గ్గ‌ర కూడా చేయ‌చ్చు. స్నానం ఆచరించే స‌మ‌యంలో గంగేచ

య‌మునే చైవ గోదావ‌రి స‌ర‌స్వ‌తి

న‌ర్మధే సింధు కావేరీ జ‌లే..స్మిన్ స‌న్నిధింకురు అనే మంత్రాన్ని జ‌పించాలి.