Spiritual: పూజ గదిలో ఈ వస్తువులు పెట్టుకోకూడదా?
Spiritual: పూజ గదిలో పొరపాటున కూడా కొన్ని సామాన్లను పెట్టుకోకూడదట. ఒకవేళ తెలీక పెట్టుకున్నా ఎన్ని పూజలు చేసినా దరిద్రం వెంటాడుతూనే ఉంటుందని అంటున్నారు వాస్తు నిపుణులు. ఇంతకీ ఏంటా వస్తువులు?
పగిలిన వస్తువులు
విగ్రహాలు, ఫోటోలు, వస్తువులు ఇలా ఏవైనా సరే ఒకవేళ చిన్న పగుళ్లు వచ్చినా కూడా వాటిని వెంటనే పూజ గది నుంచి తీసేయండి. పగిలిన విగ్రహాలు, దేవుడి ఫోటోలు నెగిటివ్ ఎనర్జీని ఆహ్వానిస్తాయి. అది ఇంటికి మంచిది కాదు. పూజ చేస్తున్న సమయంలో ఎప్పటికప్పుడు అన్నీ పరిశీలిస్తూ ఉండండి.
లెదర్ వస్తువులు
పూజ గదిలో లెదర్‌తో తయారుచేసిన వస్తువులు పెట్టకపోవడమే మంచిది. లెదర్ పూజ గదిలో ఉంటే ఆ ప్రదేశం అపవిత్రం అయిపోతుందట.
గడియారం
పూజ గదిలో గడియారం ఉండకూడదు. గడియారం నుంచి వచ్చే టిక్ టిక్ శబ్దం పూజకు ఆటంకం కలిగించేలా ఉంటుంది. పూజకు ఆటంకం కలిగించే ఏ వస్తువు కూడా మంచిది కాదు.
పాదరక్షలు
ఇది అందరికీ తెలిసిందే. అయినా కొందరు తెలీక ఇంట్లో చెప్పులు వేసుకుని తిరిగేస్తూ ఉంటారు. తెలీక పూజ గది ముందు నుంచి కూడా నడిచేస్తుంటారు. పాదరక్షలు ఎక్కడుండాలో అక్కడే ఉంచాలి. ఎంత ఖరీదైన చెప్పులైనా వాటి స్థానం పాదాల వద్దే. వాటిని ఇంట్లో వేసుకుంటే అష్ట దరిద్రం అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.
చెత్త డబ్బాలు
పూజ గది నుంచి చెత్త తీస్తుంటాం కదా అని చెత్త డబ్బాలను పూజ గది వద్దే పెట్టడం వంటివి అస్సలు చేయకండి. చెత్త డబ్బా ఎప్పుడూ కూడా ఇంటి బయటే ఉండాలి.