Spiritual: అద్దం ముందు ఇలా చేస్తున్నారా?

అద్దం ల‌క్ష్మీదేవితో స‌మానం అంటారు. అందుకే దానిని ఎంతో ప‌విత్రంగా చూసుకుంటారు (mirror). ఇంట్లో అద్దాన్ని అమ‌ర్చేట‌ప్పుడు కూడా వాస్తు ప‌రంగా సెట్ అవుతుందో లేదో అన్ని విధాలుగా జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ ఉంటాం. అయితే అద్దం ముందు చేయ‌కూడ‌ద‌ని కొన్ని ప‌నులు ఉన్నాయ‌ట‌. అవేంటో చూద్దాం. (spiritual)

*అద్దం ముందు నిల‌బ‌డి కొవ్వొత్తిని వెలిగించ‌కూడ‌దు అంటారు. అద్దానికి కొవ్వొత్తులకు మ‌ధ్య నెగిటివ్ ఎన‌ర్జీ ఉంటుందట‌.

*రెండు అద్దాల‌ను ఆపోజిట్ డైరెక్ష‌న్‌లో ఎప్పుడూ ఉంచ‌కూడ‌దు. అది బ్యాడ్ ల‌క్‌కు సూచిక‌.

*రాత్రి వేళ‌ల్లో అద్దం వైపు అదే ప‌నిగా చూస్తూ ఉండ‌కూడ‌దు. అదే విధంగా అద్దం ముందే నిద్ర‌పోకూడ‌దు. ఇవ‌న్నీ నెగిటివ్ ఎన‌ర్జీని క‌లిగిస్తాయి. (spiritual)

*పిల్ల‌లు పుట్టిన ఏడాది వ‌ర‌కు వారు అద్దాన్ని చూడ‌కూడ‌దు అంటారు. ఇది పిల్ల‌ల‌కి అప‌శ‌కునం లాంటిద‌ట‌.

*అవ‌స‌రం లేని ప్ర‌దేశాల్లో అద్దాల‌ను ఉంచ‌కూడ‌దు. (spiritual)

*ఎవ‌రికైనా కానుక‌లు ఇవ్వాల‌నుకుంటే అద్దం మాత్రం అస్స‌లు ఇవ్వ‌కండి. అది వారికి బ్యాడ్ ల‌క్‌ను ఇస్తుంది.