Ugadi నుంచి ఈ రాశుల వారికి అఖండ రాజ‌యోగం

Ugadi: క్రోధి నామ సంవ‌త్స‌ర ఉగాది త‌ర్వాత ఏ రాశుల వారికి అఖండ రాజ‌యోగం క‌ల‌గ‌బోతోందో తెలుసుకుందాం. ఉగాది నుంచి 25 రోజుల త‌ర్వాత గురుడు మ‌క‌ర రాశిలోకి ప్ర‌వేశించ‌బోతున్నాడు. ఇది చాలా మంది సూచ‌కం. తొమ్మిది గ్ర‌హాల‌లో గురుడు ఎంతో ముఖ్యం. ఎందుకంటే ధ‌నం, జ్ఞానం, సంతానం ఇచ్చేది గురుడే. అందుకే గురు బ‌లం ఎక్కువ ఉంటే ల‌క్ష దోషాలున్నా పోతాయ‌ని అంటారు. ఈ గురుడు మ‌క‌ర రాశిలోకి ప్ర‌వేశించ‌డం ద్వారా ఐదు రాశుల‌కు అదృష్ట యోగం ప‌ట్ట‌బోతోంద‌ని జ్యోతిష్య నిపుణులు చెప్తున్నారు. అవేంటంటే.. మేషం, మ‌క‌ర‌, క‌న్య‌, వృశ్చికం, క‌ర్కాట‌కం.

మేష రాశి

గురుబ‌లం వ‌ల్ల మేష రాశి వారికి ఈ ఉగాది త‌ర్వాత మ‌న‌శ్శాంతిగా ఉంటుంది. కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి. ఇంట్లో మంగ‌ళ‌క‌ర‌మైన ప‌నులు జ‌రుగుతుంటాయి. విప‌రీత‌మైన ధ‌న లాభం ఉంటుంది. డ‌బ్బు ఖ‌ర్చు చేసినా తీర్థ‌యాత్ర‌ల కోసం పెడ‌తారు. ఉద్యోగ క‌ష్టాలు పోతాయి.

మ‌క‌ర రాశి

పంచ‌మ స్థానంలోకి గురుడు రాబోతున్నాడు. సంతానానికి సంబంధించి శుభ‌వార్త‌లు వింటారు. ఐశ్వ‌ర్య సిద్ధి ఉంది. ఏ ప‌ని చేసినా స‌క్సెస్ అవుతుంది.  బంధువుల‌తో ఉన్న విభేదాలు తొల‌గిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంది.

వృశ్చిక రాశి

గురుడు వ‌ల్ల వృశ్చిక రాశి వారికి కాస్త మేలు జ‌ర‌గ‌బోతోంది. గొప్ప వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆరోగ్యం స‌హ‌క‌రిస్తుంది. అభీష్ట కార్య‌సిద్ధి ఉంది.

క‌న్యా రాశి

క‌న్యా రాశికి భాగ్య స్థానంలోకి గురుడు రాబోతున్నాడు. ధ‌న లాభం ఉంటుంది. స్వ‌గృహ లాభం ఉంటుంది.

కర్కాట‌క రాశి

క‌ర్కాట‌క రాశి వారికి గురువు 11వ స్థానంలో ఉన్నాడు. దీని వ‌ల్ల ఈ రాశి వారికి కీర్తి ప్ర‌తిష్ఠ‌లు పెరుగుతాయి. ప్ర‌తి దాంట్లో విజ‌యం ద‌క్కుతుంది. శ‌త్రు బాధ‌లు తొల‌గిపోతాయి. ఏద‌న్నా ఒక పారాయణం చేస్తే అనుకున్న‌వ‌న్నీ సిద్ధిస్తాయి.