Gold: ఈ రాశుల వారు బంగారం ధరించకూడదట
బంగారం (gold) అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ఆడవారికైనా మగవారికైనా బంగారు ఆభరణాలను ధరించాలని ఉంటుంది. అయితే.. అత్యంత ఖరీదైన మెటల్స్‌లో ఒకటైన బంగారానికి కొన్ని రాశుల వారు దూరంగా ఉండాలట. వేదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం.. బంగారం అందరికీ పడాలని.. అంటే సూట్ అవ్వాలని లేదు. కొన్ని రాశుల వారికి సూట్ అవుతుంది మరికొందరికి అవ్వదు. అసలు ఏ రాశుల వారు బంగారానికి దూరంగా ఉండాలో తెలుసుకుందాం. (spiritual)
వృషభం
వృషభ రాశివారికి బంగారం శత్రువు లాంటిదట. వృషభ రాశివారికి అధిపతి శుక్రుడు. ఈ రాశిలో పుట్టినవారు బంగారాన్ని ధరిస్తే సమస్యలు వస్తాయట. ఉద్యోగం, వ్యాపారాల్లో నష్టాలు ఎక్కువగా ఉంటాయట. రిలేషన్షిప్స్ కూడా బ్రేక్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. (gold)
మిథున రాశి
మిథున రాశిలో పుట్టిన వారికి కూడా బంగారం పడదు. వీరు తెలీక వేసుకున్నా కూడా ఆర్థిక సమస్యలు వెంటాడతాయట.
వృశ్చిక రాశి
వృశ్చిక రాశి వారు బంగారానికి ఎంత దూరంలో ఉంటే అంత మంచిదట. వృశ్చిక రాశికి బంగారం శత్రువులాంటిదని వేదిక్ ఆస్ట్రాలజీ చెప్తోంది. (gold)
కుంభ రాశి
సూర్యుడు, శని గ్రహాలు ఈ కుంభ రాశివారికి అధిపతులు. వీరు ఎలాంటి బంగారు ఆభరణాలను వేసుకోకూడదు. ఒకవేళ వేసుకున్నా ఎప్పుడూ ఏదో ఒక సమస్య వెంటాడుతూ ఉంటుందట.
NOTE: ఇది కేవలం సాధారణ సమాచారం కోసం పబ్లిష్ చేయబడింది. మీకు ఏవైనా అనుమానాలు ఉంటే నిపుణుల సంప్రదించడం మంచిది