Chandra Grahanam: త్వరలో పాక్షిక చంద్ర గ్రహణం.. ఈ రాశుల వారికి గడ్డుకాలం
Chandra Grahanam: ఈ నెల 18న పాక్షిక చంద్ర గ్రహణం రాబోతోంది. కొన్ని రాశుల వారికి రాజయోగం పట్టనుంది. మరికొన్ని రాశులకు గడ్డు కాలం. ఈ చంద్ర గ్రహణం సమయంలో ఏ రాశుల వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
సెప్టెంబర్ 18న రాబోయే పాక్షిక చంద్ర గ్రహణం ఉదయం 7:42 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12:30 నిమిషాల వరకు ఉండబోతోంది. అయితే ఈ గ్రహణం మన దేశంలో కనిపించదు కాబట్టి సూతకం పాటించాల్సిన అవసరం లేదు. అయితే గ్రహణ ప్రభావం మాత్రం అన్ని రాశుల వారిపై ఉంటుంది. ఈ గ్రహణం మీన రాశిలోని ఉత్తరాభాద్ర నక్షత్రంలోని రెండవ పాదంలో ఏర్పడనుంది. కాబట్టి.. మకరం, ధనస్సు, సింహం, వృషభ రాశులకు ఈ గ్రహణం వల్ల లాభం కలగనుంది. అదృష్టయోగం ఉంది. మీన, కుంభ, కన్యా, తులా రాశులకు ఈ గ్రహణం మంచిది కాదు.