Vastu Tips: బాత్రూమ్‌లో ఈ వస్తువులు పెడితే పేదరికమే
Vastu Tips: ఇంట్లోని ప్రతి గదికి వాస్తు ముఖ్యమే. స్నానాల గది దీనికి అతీతం ఏమీ కాదు. వాస్తు శాస్త్రం ప్రకారం స్నానాల గదిలో (బాత్రూంలో) కొన్ని వస్తువులు పెట్టడం వల్ల అది నెమ్మదిగా పేదరికానికి దారితీస్తుందట.
స్నానాల గదిలో ఉండే బకెట్లు ఎప్పుడూ నీళ్లు లేకుండా ఖాళీగా ఉండకూడదట. దీని వల్ల రాహు దోషం పెరిగే అవకాశం ఉంది. ఫలితంగా శారీరక, ఆర్థిక సమస్యలు వస్తాయి.
తడి దుస్తులను బాత్రూమ్‌లో అలాగే వదిలేయకూడదు. దీని వల్ల జాతక చక్రమంలో సూర్య గ్రహం వీక్ అయిపోతుందట.
బాత్రూమ్‌లో ఉండే అద్దాలు పగిలి ఉండకూడదు. ఆర్థిక సమస్యలు వస్తాయి.
బాత్రూమ్‌లో కుళాయిల నుంచి నీళ్లు కారుతూ ఉండకూడదు. బాత్రూమ్‌లో అనే కాదు.. ఇంట్లోని ఏ నల్లా నుంచి కూడా నీళ్లు పోకూడదు.
బాత్రూమ్‌లో నల్ల బకెట్ అనేది ఉపయోగించకూడదు. నీలం బకెట్ వాడితే మంచిది.