Lifestyle: ఈ అలవాట్లు మీ జీవితాన్నే మర్చేస్తాయ్!
Hyderabad: మన జీవితం (lifestyle) మనం అలవర్చుకునే అలవాట్లపైనే ఆధారపడి ఉంటుంది. ఈ రిచ్ హ్యాబిట్స్‌ని (rich habits) అలవాటు చేసుకుంటే జీవితంలో (lifestyle) సక్సెస్ అవుతారు అని అంటున్నారు నిపుణులు. అవేంటో చూద్దాం.
తెల్లవారుజామున లేవడం
రిచ్ మైండ్‌సెట్ ఉన్నవారు తెల్లవారుజామున 4 లేదా 5 గంటలకు లేస్తారట. ఆ తర్వాత రోజంతా ఏం చేయాలో నీట్‌గా ప్లాన్ చేసుకుంటారట. ఉదయం త్వరగా లేవడం వల్ల ఆ రోజు త్వరగా గడిచిపోయినట్లు అనిపించదు. మీకు ఏదైనా ప్లాన్ చేసుకోవడానికి ఇంకాస్త సమయం దొరికనట్లు అవుతుంది.
లిస్ట్ రాసుకోవడం
ఉదయం లేవగానే ఆ రోజు ఏం ప్లాన్ చేయాలో ఓ లిస్ట్ రాసి పెట్టుకోండి. దీని వల్ల ఇంపార్టెంట్ విషయాలు మర్చిపోకుండా ఉంటారు. దీనిని To-Do List అంటారు. ఇది రిచ్ పీపుల్ సీక్రెట్ వెపన్ అని చెప్తుంటారు.
నో గాసిప్స్
రిచ్ మైండ్ సెట్ ఉండేవారు గాసిప్స్‌కి దూరంగా ఉంటారు. వీరికి ఎదురింటి వాళ్లు ఏమనుకుంటారు.. పక్కింట్లో ఏం జరుగుతోంది అన్న ధ్యాస ఉండదు. లేచిన దగ్గర్నుంచి ఎలా సక్సెస్ అవ్వాలి అనేదాని గురించే ఆలోచిస్తుంటారు.
డైట్ అండ్ ఎక్సర్‌సైజ్
ఆరోగ్యకరమై తిండి తింటూ ఎక్సర్‌సైజ్ చేస్తూ ఉండేవారి బ్రెయిన్ కూడా షార్ప్‌గా ఉంటుంది. అందుకే మనం ఏది తింటామో అదే మనం అని చెప్తుంటారు. కాబట్టి ముందు మంచి ఫుడ్ తినాలి.. తగినంత వర్కవుట్స్ చేస్తుండాలి.
బిజినెస్ గోల్స్
ఇప్పుడు ఇంటర్నెట్ మన చేతిలోనే ఉంది. దాన్ని ఎలా వాడాలో కూడా మన చేతిలోనే ఉంది. టైంపాస్ చేయాలనుకునేవారు ఓ సినిమా చూడాలనుకుంటారు. కానీ రిచ్ మైండ్ సెట్‌తో ఉండేవారు ఆ ఇంటర్నెట్ ద్వారా బిజినెస్ గోల్స్ గురించి ఆలోచిస్తారు.