Money: డ‌బ్బు నిల‌వ‌టంలేదా.. ఇవే కార‌ణాలు కావ‌చ్చు..!

Hyderabad: క‌ష్ట‌ప‌డి సంపాదించినంతా(money) క్ష‌ణంలో ఆవిరైపోయిన‌ట్లు అనిపిస్తుంది. ఒక్కోసారి అస‌లు ఎలా ఖ‌ర్చు అయిపోయాయో అర్థంకాదు. అయితే కార‌ణాలు ఏవైన‌ప్ప‌టికీ.. ఈ టిప్స్ పాటిస్తే మీ డ‌బ్బు మీ చేతుల్లోనే ఉంటుంది.

చెడు అల‌వాట్లు
సిగ‌రెట్లు, మందు, జంక్ ఫుడ్.. వీటిని ఎంత త‌గ్గించుకోవాల‌ని చూసినా మ‌న‌సు లాగుతుంటుంది. అస‌లే వీటి ధ‌ర‌లు ఇప్పుడు ఆకాశాన్ని అంటుతున్నాయి. అలాంట‌ప్పుడు ఈ అల‌వాట్లు ఎందుకు చెప్పండి? వెంట‌నే మానేయ‌లేక‌పోతే.. వారం వారం వాటి వాడ‌కం త‌గ్గించేయండి. ఎంత పొదుపు చేస్తున్నారో చూసి మీరే షాక్ అవుతారు.

రిస్క్ తీసుకోక‌పోవ‌డం
అవును. చేతిలో డ‌బ్బు ఉంటే చాల‌నుకుంటారు చాలా మంది. ప‌ర్సులో డ‌బ్బు పెట్టి అది ప్ర‌తి సంవ‌త్స‌రం పెరగాలి అనుకుంటే అవ్వ‌దు క‌దా..! అందుకే కాస్త బాగా రీసెర్చ్ చేసి రిస్క్ తీసుకోండి. కుదిరితే న‌మ్మ‌క‌మైన పెట్టుబ‌డుల్లో పెట్టండి. ఇందుకోసం ఎక్స్‌ప‌ర్ట్స్ స‌ల‌హా ఇవ్వ‌డానికి రెడీగా ఉంటారు.

బ‌డ్జెట్ లోపం
వ‌చ్చే జీతం ఎంతో చూసుకుని దానికి త‌గ్గ‌ట్టు బ‌డ్జెట్‌ను రూపొందించుకోవాలి. కొంద‌రు వ‌చ్చే జీతం త‌క్కువైన‌ప్ప‌టికీ విలాసంగా బ‌త‌కాలి అనుకుంటారు. దాని వ‌ల్ల ఉన్న డ‌బ్బుపోయి అప్పులు చేయాల్సిన ప‌రిస్థితి వ‌స్తుంది. కాస్త అడ్జ‌స్ట్ అయితే సేవింగ్స్ చేసుకోవ‌చ్చు.

పట్టీ రాసుకోక‌పోవడం
కొంద‌రు కేవ‌లం పెద్ద ఖ‌ర్చుల‌ను మాత్ర‌మే ప‌ట్టీలో రాస్తుంటారు. చిన్న చిన్న ఖ‌ర్చుల‌ను వదిలేస్తుంటారు. నిజానికి రాసి పెట్టుకోవాల్సింది చిన్న ఖ‌ర్చులే. ఇప్పుడున్న యాప్స్‌లో ఈజీగా ట్రాకింగ్ చేసుకునే వీలు ఉంది. దీనిని బ‌ట్టి ఎక్క‌డ ఎక్కువ‌గా వృధా ఖ‌ర్చు అవుతోందో సులువుగా క‌నిపెట్ట‌చ్చు.

ఒక్క ఉద్యోగంపైనే ఆధార‌ప‌డ‌టం
మీరు చేస్తున్న ఉద్యోగం ఒక్క‌టే ఇప్పుడున్న ఖ‌ర్చుల‌కు స‌రిపోతుంది అనుకుంటే పొర‌పాటే. ఈ మ‌ధ్య‌కాలంలో ఉద్యోగం చేస్తూనే సైడ్ హ‌జిల్స్ చేస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. మీకు ఓపిక ఉంటే.. ట్యూషన్లు చెప్ప‌డం, ఫ్రీలాన్సింగ్ చేయ‌డం ఇలా మీకు ఏది వ‌స్తే దానిపై ఫోక‌స్ చేసి సైడ్ ఇన్క‌మ్ సంపాదించుకోండి.