Best Courses: ఇంట‌ర్ అయ్యిందా? ఈ కోర్సుల‌పై ఓ క‌న్నేయండి!

Hyderabad: ఇంట‌ర్మీడియ‌ట్ (intermediate) కంప్లీట్ అయిందా? అయితే ఈ బెస్ట్ మీ ఆన్‌లైన్ కోర్సులు (best courses) మీకోస‌మే. ఈ కోర్సుల్లో స్కిల్స్ పెంచుకున్నవారికి మంచి డిమాండ్ ఉన్న‌ట్లు వైద్య నిపుణులు చెప్తున్నారు.

చార్టెడ్ అకౌంటెంట్ (CA)
ఇంట‌ర్‌లో కామ‌ర్స్ చదివి ఉంటే సీఏ కోర్సులో చేరిపోవ‌డం ఉత్త‌మం. కామ‌ర్స్ స్టూడెంట్స్‌కి ఇది పెద్ద క‌ష్ట‌మైన కోర్స్ ఏం కాదు. సులువుగా పూర్తిచేసేయ‌గ‌లుగుతారు. సీఏకు సంబంధించిన వివ‌రాలు, ఎగ్జామ్స్ గురించి తెలుసుకోవాలంటే సీఏ క్ల‌బ్ ఇండియా యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి.

ప్రొడ‌క్ట్ మేనేజ‌ర్ (product manager)
ప్రొడ‌క్ట్స్‌ని ఎలా డెవ‌ల‌ప్ చేయాలి? వాటిని ప్ర‌జ‌ల్లోకి ఎలా తీసుకెళ్లాలి? వంటి విష‌యాల‌పై అవ‌గాహన ఉంటే ప్రొడ‌క్ట్ మేనేజ్‌మెంట్ కోర్స్ బెస్ట్. ప్రొడ‌క్ట మేనేజ్‌మెంట్ కోర్సులు నేర్చుకుని నైపుణ్యాలు సాధించిన‌వారు ఇప్పుడు ల‌క్ష‌ల్లో జీతాలు తీసుకుంటున్న‌ట్లు ఓ నివేదిక‌లో తేలింది. ఈ కోర్సుపై ఇంట్రెస్ట్ ఉంటే డిజి పెర్ఫామ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.

డిజిట‌ల్ మార్కెటింగ్ (digital marketing)
డిజిట‌ల్ రిసోర్సుల‌ను ఉప‌యోగించి ప్రొడ‌క్టుల‌ను మార్కెటింగ్ చేసి సేల్స్‌ని పెంచుకోవ‌డ‌మే డిజిట‌ల్ మార్కెటింగ్. అప్‌రైస్డ్, అప్‌గ్రాడ్స్ యాప్స్‌లో డిజిట‌ల్ మార్కెటింగ్‌కు సంబంధించి బోలెడు కోర్సులు ఉన్నాయి.

ఇప్పుడు స్టూడెంట్స్‌కు కావాల్సిన అన్ని రిసోర్సులు అందుబాటులో ఉన్నాయి. న‌చ్చిన కోర్సులు న‌చ్చిన జాబ్ చేయాల‌ని ప్ర‌తి ఒక్కరికి ఉంటుంది. కానీ ఆ జాబ్ మంచి జీతాన్ని కూడా తెచ్చిపెట్టేది అయ్యుండాలి. పెరుగుతున్న ఖ‌ర్చులను గుర్తుపెట్టుకుని మంచి సాల‌రీలు ఆఫ‌ర్ చేసే కోర్సులు నేర్చుకుని అందులో నైపుణ్యం సాధిస్తే మిమ్మ‌ల్ని ఆపేవారే ఉండ‌రు.