Best Cities: ఉద్యోగాలకు ఈ నగరాలు ది బెస్ట్..!
Hyderabad: మంచి ఉద్యోగం(job) ఎంచుకోవడం ఎంత ముఖ్యమో.. మంచి నగరంలో(best cities) ఉద్యోగం చేయడం కూడా అంతే ముఖ్యం. మన ఇండియాలో ఉద్యోగాలకు ది బెస్ట్ నగరాలు ఇవేనట. అవేంటో చూద్దాం.
బెంగళూరు (Banglore)
కర్ణాటక రాజధాని, అతిపెద్ద ఐటీ హబ్‌గా పేరొందిన బెంగళూరు జాబ్ చేయడానికి ది బెస్ట్ ప్లేస్ అని సర్వేలో తేలింది.
ముంబై (Mumbai)
మన దేశ ఆర్థిక రాజధాని అయిన ముంబై కూడా బెస్ట్ వర్క్ ప్లేస్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువగా ఫైనాన్స్, మీడియా, ఎంటర్‌టైన్మెంట్ రంగాల్లో ఉద్యోగాలు ఇక్కడ ఉంటాయి.
దిల్లీ (Delhi)
మన రాజధాని దిల్లీ కూడా జాబ్స్‌కి బెస్ట్ సిటీల్లో ఒకటి. గవర్నమెంట్, ఫైనాన్స్, ఐటీ సెక్టార్లకు సంబంధించిన ఉద్యోగాలు ఇక్కడ ఎక్కువ.
చెన్నై (Chennai)
తమిళనాడు రాజధాని చెన్నైలో ఆటోమొబీల్, ఐటీ రంగాలకు చెందిన ఉద్యోగాలు ఎక్కువ.
పుణె (pune)
ఐటీ హబ్‌గా ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న నగరం పుణె. ఇంజినీరింగ్, తయారీ సంస్థలు ఇక్కడ ఎక్కువ.
హైదరాబాద్ (Hyderabad)
ఈ లిస్ట్‌లో మన భాగ్యనగరం లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి. బెస్ట్ ఐటీ హబ్స్‌లో ఒకటిగా నిలిచిన హైదరాబాద్‌లో ఐటీ సెక్టార్, ఫార్మా రంగాలు ఎక్కువగా రానున్నాయి.
కలకత్తా (Kolkata)
వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తా విద్య, ఫైనాన్స్, తయారీ సంస్థలకు సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ఎక్కువ.
అహ్మదాబాద్ (Ahmedabad)
టెక్ట్సైల్, గార్మెంట్ ఇండస్ట్రీస్‌కి పెట్టింది పేరు అహ్మదాబాద్. ఇక్కడ త్వరలో ఐటీ సెక్టార్ కూడా రాబోతోంది.
జైపూర్ (Jaipur)
రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో ఎక్కువగా టూరిజంకు సంబంధించిన ఉద్యోగాలు ఎక్కువ. టెక్ట్సైల్, హ్యాండీక్రాఫ్ట్‌కు సంబంధించిన పరిశ్రమలు కూడా ఉన్నాయి.