Vastu: ఈ వస్తువులు ఇంట్లో ఉంటే అరిష్ఠం..!
Vastu: మనకు తెలీకుండా కొన్ని ఇంట్లో ఉండు వస్తువుల వల్ల వాస్తు శాస్త్రం ప్రకారం ఎప్పుడూ సమస్యలు వస్తూ ఉంటాయి. అవి ఏ సమస్యలైనా కావచ్చు. ఆర్థికంగా, మానసికంగా, అనారోగ్య సమస్యలు ఇలా ఏవైనా కావచ్చు. ఆ వస్తువులేంటో.. అవి ఇంట్లో ఉంటే ఎలాంటి నష్టాలు జరుగుతాయో తెలుసుకుందాం.
*మంచం కింద షూ ర్యాక్ పెట్టుకున్నారా? ఇది దరిద్రం. ఎప్పుడూ కూడా మంచం కింద బూట్లను పెట్టకూడదు. బయట తిరిగి వచ్చి ఎక్కడెక్కడో ఏం తొక్కుతామో తెలీదు. వాటిని అలాగే ఇంట్లోకి తెచ్చి పెట్టుకుంటే అరిష్ఠం.
*మీ ఇంట్లో ఫర్నీచర్ డిజైన్ ఎలా ఉందో చూసుకోండి. అంతే ఫర్నీచర్ చివర్లలో మరీ షార్ప్‌గా ఉంటే అది వాస్తు ప్రకారం మంచిది కాదు. దీని వల్ల దెబ్బలు తగలడం, బ్లీడింగ్ అవ్వడం వంటివి జరుగుతాయి.
*ఇంట్లో విరిగిపోయిన లేదా పగిలిపోయిన సామాన్లు ఉన్నా కూడా తీసేయండి. ఒకవేళ వాటిని తీసేయలేకపోతే ఎవరికైనా అమ్మేయడం వంటివి చేసినా మంచిదే. ఇలాంటి సామాన్లు ఇంట్లో ఉంటే మనశ్శాంతి ఉండదు.
*కుళాయిల నుంచి నీరు పోతోందేమో చూసుకోండి. ఇంట్లో నీళ్లు వృథా అయితే లక్ష్మీదేవి ఉండదు. ఆ ఇంటికి మంచిది కూడా కాదు. కాబట్టి బాత్రూమ్లలో కిచెన్ వాష్ ఏరియాల్లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి.
*ఇంట్లో ముళ్ల మొక్కలను పెట్టుకోకండి. వాటికి ఉండే ముళ్లు నెగిటివ్ ఎనర్జీని రిలీజ్ చేస్తాయి.
*ఇంటిని ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవాలి. వస్తువులను ఎక్కడపడితే ఎలా పడితే అలా పెట్టుకోకూడదు.