Spiritual: శివుడి అంశతో పుట్టిన 4 రాశుల వారు వీరే..!
Spiritual: 12 రాశులలో నాలుగు రాశుల వారు సాక్షాత్తు శివయ్య అంశతో పుట్టినవారట. ఈ నాలుగు రాశుల వారంటే శివుడిని ఎంతో ప్రీతి. మరి ఆ నాలుగు రాశులు ఏంటో తెలుసుకుందాం. శివుడు ప్రతి ఒక్క భక్తుడిపై ఎక్కువ శ్రద్ధ చూపిస్తాడు. అంతేకాదు.. శివుడికి తన భక్తులంతా కూడా ప్రీతికరమైన వారే. తన భక్తులు ప్రేమతో ఏది సమర్పించినా దానిని స్వీకరిస్తాడు. ప్రతి ఒక్క భక్తుడిని కూడా అందరితో సమానంగా ప్రేమిస్తాడు. అయితే ఈ నాలుగు రాశుల వారిలో ఉన్న ప్రత్యేకమైన లక్ష్యాలు, వారిలోని మంచితనమే శివుడికి ఎంతో నచ్చుతుంది. అందుకే శివుడికి ఈ నాలుగు రాశుల వారంతే ఎంతో ప్రత్యేకం.
అన్నిటికంటే ముఖ్యంగా తన ప్రత్యేకమైన కృపను ఈ నాలుగు రాశులపై ఎప్పుడూ ఉంచుతాడు. శివుడు వీరికి ఎప్పుడూ తన ఆశీర్వాదాన్ని అందిస్తూ రక్షగా ఉంటాడు. అలాగే.. పరమ శివుడు తనను భక్తి శ్రద్ధలతో కొలిచిన వారికి సులువుగానే లొంగిపోతారు. ప్రతి ఒక్కరి కోరికను కూడా భోళా శంకరుడు తీరుస్తాడు. అయితే శివుడికి ఈ నాలుగు రాశుల వారంటే మాత్రం కొన్ని ప్రత్యేకమైన కారణాల వల్ల ఎక్కువ ఇష్టం ఉంటుంది. అలాగే.. ఈ నాలుగు రాశుల వారు కూడా శివయ్య పట్ల ఎప్పుడూ విధేయతను కలిగి ఉంటారు. (Spiritual)
కన్యా రాశి
కన్యా రాశి వారి మనసు ఎంతో స్వచ్ఛమైనది. వీరు చాలా సున్నితమైన మనసు కలిగినటువంటి వారు. వీరు తమ మనసులో ఏదీ దాచుకోరు. అలాగే అది ఏదైనా సరే ప్రతి ఒక్కరితో కూడా పంచుకుంటారు. అంతేకాక వీరిలో క్షమాగుణం ఎక్కువ. మంచి క్రమ శిక్షణను కలిగి ఉంటారు. వీరి మనసు చాలా విశాలమైంది. వీరు ఏది పొందినా వీరి కష్టార్జితంగా పొందాలి అని కష్టపడి సాధించాలి అనే అనుకుంటారు తప్ప వేరొకరు చేసింది పొందాలి అని కానీ వేరొకరికి సంబంధించి విషయాలు వీరే చేసిన దానిగా గొప్పగా చెప్పుకోవడం కానీ అస్సలు చేతకాదు. అందుకే శివుడికి కన్యా రాశి వారంటే ఎంతో ఇష్టం.
ALSO READ: Astrology: 2024లో ఈ రాశుల వారు అప్రమత్తంగా ఉండాలి
కర్కాటక రాశి
కర్కాటక రాశికి చెందిన వారు భిన్న సంస్కృతి సంప్రదాయాలను కలిగి ఉంటారు. సాంప్రదాయాల పట్ల ఎక్కువ విధేయతను కలిగి ఉంటారు. మన సంప్రదాయాలే మనల్ని ముందుకు నడిపిస్తాయి. మనల్ని గొప్ప స్థానంలో ఉంచుతాయి. అలాగే మనకు మంచి పేరు ప్రతిష్ఠలు తెస్తాయి అనే గట్టి నమ్మకాన్ని కలిగి ఉంటారు. ఈ కారణంగానే కర్కాటక రాశి వారికి దైవం పట్ల ఎక్కువ శ్రద్ధ, నమ్మకం ఉంటాయి. వీరిపై శివయ్య ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి. కర్కాటక రాశి వారు సోమవారం రోజున ఆవుకి ఆహారం పెడితే ఎంతో మంచిది.
మేష రాశి
మేష రాశికి చెందినవారు ఎప్పుడూ కూడా భగవంతుడిని స్మరిస్తూ ఉంటారు. దేవుడిపై వీరికి భక్తి ఎక్కువగా ఉంటుంది. అలాగే ప్రతి రోజూ కూడా వీరు దేవుడిని పూజిస్తారు. ఒకవేళ వీరికి దైవాన్ని పూజించే అవకాశం లేని రోజు వారు ఇష్టపడే వ్యక్తులతో లేదా వారి కుటుంబ సభ్యులతో కచ్చితంగా పూజిస్తారే తప్ప ఏ రోజూ కూడా అలా పూజ చేయకుండా వదిలేయరు. సంప్రదాయాలకు ఎంతో విలువ ఇస్తారు. అందుకే శివుడికి ఈ రాశి వారంటే కూడా ఎంతో ప్రీతి. సోమవారం రోజున ఎవరికైనా పట్టెడు అన్నం పెడితే ఎంతో మంచిది.
కుంభ రాశి
కుంభ రాశి వారు పైకి కనిపించరు కానీ వీరికి దైవం పట్ల ఎంతో భక్తి శ్రద్ధలు ఉంటాయి. అయితే వీరి భక్తిని కానీ శ్రద్ధను కానీ బయటికి చూపించరు. అంటే నలుగురిలో ఉన్నప్పుడు దేవుడిని పూజించడం, దేవుడి మంత్రాలు చేయడం వంటివి చేయరు. ఎవ్వరూ లేనప్పుడు దైవ భక్తికి చూపిస్తారు. కుంభ రాశి వారు ఎదుటి వారికి నచ్చిన విధంగా ఉంటారు. ప్రతి విషయంలో వీరి అంచనాలు సరిగ్గా ఉంటాయి. ఈ రాశి వారు ఎలాంటి విషయాల్లోనూ అబద్ధాలు ఆడరు. కుంభ రాశి వారు సులువుగా మోసపోతారు. కుంభ రాశి వారు సోమవారం రోజున శివ నామ స్మరణ చేస్తూ ఎవ్వరినీ కూడా దూషించకుండా ఉంటే ఎంతో మంచిది.