Spiritual: ఇంట్లో ఈ 3 విగ్ర‌హాలు క‌చ్చితంగా ఉండాల్సిందే

Spiritual: పూజా గ‌దిలో ఎన్నో దేవుళ్ల విగ్ర‌హాలు, ఫోటోల‌తో ఓ చిన్న దేవాల‌యాన్నే త‌యారుచేయించి పెట్టుకుంటూ ఉంటారు. కొంద‌రి ఇళ్ల‌ల్లో దాదాపు అన్ని ర‌కాల దేవుళ్ల ఫోటోలు ఉంటాయి. ఇంకొంద‌రు వారి కుల‌దైవాన్నే పూజిస్తుంటారు. అయితే హిందువుల ఇళ్ల‌ల్లో ఈ మూడు విగ్ర‌హాలు క‌చ్చితంగా ఉండాల‌ని వాస్తు శాస్త్రం చెప్తోంది.

కుబేరుడు

ఇంట్లో త‌ప్ప‌కుండా ఉండాల్సిన విగ్ర‌హాల్లో కుబేర విగ్ర‌హం ఒక‌టి. ఒక‌వేళ ఈ విగ్ర‌హం మీ ఇంట్లో ఉన్న‌ట్లైతే అది ఉత్త‌ర దిక్కులో ఉందో లేదో చూడండి. కుబేర విగ్ర‌హం ఇంట్లో ఉంటే డ‌బ్బుకు కొద‌వ ఉండ‌ద‌ని చెప్తుంటారు.

ఇంద్రుడు

ఇంద్రుడి విగ్ర‌హం గురించి మీరు విని ఉండ‌రు. కానీ మీకు ఒక‌వేళ ఇంద్రుడి విగ్ర‌హం దొరికితే తెచ్చి పెట్టుకోండి. ఈ విగ్ర‌హాన్ని తూర్పు దిక్కులో పెట్టాలి. ధైర్యాన్ని, బ‌లాన్ని ఇచ్చేవాడు ఇంద్రుడు. ఇత్త‌డి విగ్ర‌హం ఉంటే ఇంకా మంచిది.

పంచ‌ముఖ హ‌నుమాన్

ఐదు ముఖాలు క‌లిగిన హ‌నుమంతుడి విగ్ర‌హం కూడా ఇంట్లో త‌ప్ప‌కుండా ఉండాల్సిందే. ఈ విగ్ర‌హం మీ ఇంట్లో ఉంటే ద‌క్షిణ ముఖంగా ఉంచండి. ఇంట్లోని నెగిటివ్ ఎనర్జీల‌న్నీ తొల‌గిపోతాయి.