Spiritual Remedy: భార్యాభర్తల మధ్య అన్యోనం పెంచే రెమిడీ
Spiritual Remedy: ఒకప్పుడు భార్యాభర్తల మధ్య ఏవన్నా సమస్యలు వస్తే పెద్దవారితో చర్చించుకోవడమో లేదా సర్దుకుపోయి కాపురాలు చేసుకోవడమో వంటివి చేస్తుండేవారు. కానీ ఇప్పుడు సహనం, ఓపిక ఈ కాలం వారికి లేవు. చిన్న చిన్న కారణాలకే కొన్ని నెలల్లోనే విడిపోతున్న కేసులు చాలానే చూసాం. అయితే భార్యాభర్తలు కలకాలం అన్యోన్యంగా ఉండాలంటే ఈ రెమిడీ చేసి చూడండి అంటున్నారు ప్రముఖ జ్యోతిష్య నిపుణులు నానాజీ పట్నాయక్.
ఇంతకీ ఆ రెమిడీ ఏంటంటే.. ఆలయాల్లో నవగ్రహాల వద్ద కుజుడు, శుక్రుడు గ్రహాల వల్ల వీలున్నప్పుడల్లా దీపాలు పెట్టడం మంచిది. ఇదే కాకుండా సంకటహర చతుర్థి నాడు గణనాథుడికి ఉండ్రాళ్లు పెట్టినా మంచి ఫలితం ఉంటుందట. ఇక మూడో రెమిడీ ఏంటంటే.. లలితా సహస్ర నామాల్లోని ఓం శివకామేశ్వరాంకస్థాః శివ స్వాధీన వల్లభా అనే మంత్రాన్ని రోజూ అరగంట కానీ లేదా అంతకుమించి మీకు సమయం ఉంటే ఎక్కువ సేపైనా చేసుకోవచ్చు.