Spiritual: భర్త సంపాదన పెరగాలంటే ఏం చేయాలి?
Spiritual: భర్త సంపాదన పెరగాలంటే భార్య చేయాల్సినవి, చేయకూడనివి కూడా మన శాస్త్రాల్లో చెప్పారట. అవేంటో చూసేద్దాం.
భర్త ఉద్యోగానికైనా లేకా వ్యాపారం చూసుకోడానికైనా బయటికి వెళ్లిన వెంటనే ఇంటి తలుపులు వేసేయకూడదు. ఓ ఐదే నిమిషాలు ఆగి అప్పుడు తలుపులు వేసుకోవాలట.
భర్త ఇంట్లో నుంచి పని మీద బయటికి వెళ్లగానే ఇల్లు చిమ్మడాలు, అలకడాలు వంటివి చేయకూడదు
భర్త ఇంట్లో నుంచి బయటికి వెళ్లాక భార్యలు స్నానాలు చేస్తుంటారు. అలా చేయకూడదని ప్రామాణిక పరిహార శాస్త్రంలో చెప్పారు. కావాలంటే కాసేపు ఆగి అప్పుడు స్నానాలు వంటివి చేసుకోవచ్చు.
స్త్రీలు స్నానం చేసాక కుంకుమ బొట్టు పెట్టుకునేటప్పుడు ఓం సర్వేస్వరీ సర్వ శక్తి స్వరూపిని మమ కుటుంబ రక్షామ్ కురు కురు స్వాహా అనే మంత్రం చదువుకుంటూ పెట్టుకుంటే మంచిది.
ఉదయం నిద్రలేవగానే ఆడవారు గణనాథుడి ఫోటోను చూడాలి
శుక్రవారం రోజున అమ్మవారికి ఎండు ద్రాక్ష నైవేద్యంగా పెడితే ఎంతో మంచిది
వంటగదిలో ఉండే యాలకులు ఎప్పుడూ ఆకుపచ్చ రంగులో ఉండేలా చూసుకోవాలి. కొందరి ఇళ్లల్లో ఎండిపోయినట్లు ఉంటాయి. అలా ఉండకూడదట.
స్త్రీలు ఎక్కువగా ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు మట్టి గాజులు ధరిస్తూ ఉండాలి. అది కూడా ఆదివారం కానీ శుక్రవారం కానీ గాజులు కొనుగోలు చేయాలి.