Spiritual Remedy: ప్రతి రోజు శుభవార్తలు వినాలంటే ఈ మంత్రం చదవండి
Spiritual Remedy: ఉదయం లేచిన దగ్గర్నుంచి శుభవార్తలు వినాలనే అనుకునేవారు ఉంటారు కానీ ఎవ్వరూ కూడా చెడు వార్తలు వినడానికి ఇష్టపడరు. ఏదన్నా మంచి కానీ చెడు కానీ వార్త విన్నాము అంటే దానికి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మూడో స్థానంలో ఉండే బుధుడు కారణం. ఎందుకంటే ఆయన వార్తాలాపనం చేస్తుంటాడు. బుధుడు సరిగ్గా లేకుండా ఆ స్థానం పాడైందంటే.. ఆ వ్యక్తి ఎప్పుడూ ఏదో ఒక చెడు వార్తలు వింటూనే ఉంటాడు. బుధుడు సరిగ్గా లేకపోతే ఆయనకు సంబంధించిన ధానాలు చేస్తుంటే ఆ చెడు శక్తిని మనం దానం ఇచ్చేస్తూ మన బుధుడి స్థానాన్ని బలపరుచుకోవాలి.
వాస్తు పరంగా కూడా ఇక్కడ చూడాల్సి ఉంటుంది. అంటే ఉత్తర భాగం సరిగ్గా లేకపోవడం.. ఆ స్థానంలో బాత్రూమ్‌లు లెట్రిన్‌లు కట్టించుకుని ఉండటం వంటివి చేయకూడదు. ఉత్తర దిశ పాడైతే ఇంట్లో దారిద్ర్యం మొదలవుతుంది. ఇక ఎప్పుడూ మంచి వార్తలు వింటూ సంతోషంగా జీవించాలంటే లలితా సహస్ర నామాల్లోని ఓం కదంబ మంజరీ క్లుప్త కర్ణపూడ, మనోహరాయై నమః అనే మంత్రాన్ని రోజూ ఒకే సమయానికి అరగంట పాటు చదువుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది.