Spiritual: స‌క్సెస్ కోసం ఈ మంత్రాలు జ‌పించండి

స‌క్సెస్ అవ్వాలి కోరుకోనివారు ఉండ‌రు. మ‌న కృషికి దైవ కృప కూడా తోడైతే ఇక ఆ మ‌నిషి జీవితంలో వెన‌క్కి తిరిగి చూసుకోవాల్సిన పని లేదు. మీరు ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా స‌క్సెస్ రావ‌డంలేదంటే.. ఈ మంత్రాలు జ‌పించి చూడండి.(spiritual)

ఓం గం గ‌ణ‌ప‌త‌యే న‌మః

విఘ్నాల‌ను తొల‌గించే వినాయ‌కుడి మంత్రం ఇది. ఏదైనా ప‌నికి వెళ్లే ముందు మంచి పని త‌ల‌పెట్టే ముందు ఈ మంత్రాన్ని జ‌పిస్తే ఎంతో మంచిద‌ట‌.

ఓం శ్రీం హ్రీం క్లీం మ‌హాల‌క్ష్మి న‌మః

అష్టైశ్వ‌ర్యాల‌ను క‌లిగించే మ‌హాల‌క్ష్మి అమ్మ‌వారి మంత్రం ఇది. ఈ మంత్రం జ‌పిస్తే మ‌నిషి ప్ర‌యాణం విజ‌యం వైపే ఉంటుంద‌ట‌. (spiritual)

ఓం ఐం స‌ర‌స్వ‌త్యాయ్ న‌మః

చ‌దువుల త‌ల్లి స‌ర‌స్వ‌తి అమ్మ‌వారి మంత్రం ఇది. ఈ మంత్రాన్ని జ‌పిస్తే క్రియేటివ్‌గా ఆలోచించ‌డం మొద‌లుపెడ‌తారు. తెలివితేట‌లు వ‌స్తాయని న‌మ్మ‌కం.

ఓం వ‌సుధ‌రే స్వాహా

భూదేవికి సంబంధించిన మంత్రం ఇది. నాకు అష్టైశ్వ‌ర్యాలు, విజ‌యాన్ని ప్రాప్తించు తల్లీ అని వేడుకుంటున్న‌ట్లు ఆ మంత్రం అర్థం. మ‌నం విజ‌యం కోసం వేసే ప్ర‌తి అడుగుని ఓ కంట క‌నిపెట్టి ఆ విజ‌యాన్ని క‌లిగించు అమ్మా అని ఈ మంత్రాన్ని జ‌పించాలి. (spiritual)