Spiritual: మెట్టెలు పెట్టుకోవడం వల్ల కలిగే లాభాలేంటి?
Spiritual: వివాహితులు కాళ్లకు మెట్టెలు (toe rings) పెట్టుకోవడాన్ని చూస్తుంటాం. ఒక అమ్మాయికి పెళ్లి అయ్యింది అంటే కాలికి మెట్టెలు పెట్టుకుందా ఎలాంటివి పెట్టుకుంది వంటి అంశాలను పరిశీలిస్తుంటారు. కాలికి మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయి.
*మెట్టెలు పెట్టుకోవడం వల్ల ఆడవాళ్లకు సంతాన సాఫల్యత మెరుగవుతుందట. మెట్టె పెట్టుకునే రెండో వేలు నరం యోనికి లింక్ అయ్యివుంటుంది.
*వెండి ధరిస్తే శరీరం చల్లగా ఉంటుంది. అందుకే చాలా మంది వెండి మెట్టెలనే పెట్టుకుంటారు. ఒంట్లో వేడి ఎక్కువైతే వెండి మెట్టలు చల్లపరుస్తాయి.
*మెట్టెలు పెట్టుకుంటే వేళ్లలోని సరైన నరాలపై మంచి ప్రభావం కలుగుతుంది. ఇందాక చెప్పినట్లు సంతాన సాఫల్యత మెరుగవ్వడంతో పాటు రుతుక్రమ సమస్యలు కూడా ఉండవట.
*అయితే విరిగిపోయిన వంకరగా ఉన్న మెట్టెలను అస్సలు ధరించకూడదు. దీని వల్ల నెగిటివ్ ఎనర్జీ కలుగుతుంది. బంగారం, స్టీల్, ఐరన్ లోహాలతో తయారుచేసినవి మాత్రం పెట్టుకోకండి.