మంగళసూత్రం విషయంలో పాటించాల్సిన నియమాలు
Spiritual: మన సనాతన ధర్మంలో మంగళసూత్రానికి స్త్రీలు ఎంతో విలువ ఇస్తారు. అయితే ఆ మంగళసూత్రం విషయంలో ముఖ్యమైన నియమాలు పాటించాల్సి ఉంటుంది. మొదటిది ఏంటంటే.. ఈ మధ్యకాలంలో చాలా మంది స్త్రీలు మంగళసూత్రాన్ని మొత్తం బంగారంలో కలిపి వేసుకుంటారు. అలా వేసుకోకూడదు. కాస్త పసుపు తాడును కలిపి వేసుకోవాలి. మరి పసుపు తాడుని ఎప్పుడు మారుస్తుండాలి అనే సందేహం వస్తే.. ఆ తాడులోని ఒక్క పొర పాడైపోయినా వెంటనే మార్చేయాలి. మరో పసుపు తాడు వేసుకోవాలనుకుంటే కచ్చితంగా ఒక మంచి రోజు చూసుకుని వేసుకోవాలి. రాహుకాలం, వర్జ్యం వంటివి ఉండకూడదు.