Krishnashtami పూజా విధానం
ఈసారి శ్రీకృష్ణ జన్మాష్టమి (krishnashtami) ఈనెల 6, 7 తేదీల్లో వచ్చింది. ఆరోజున కన్నయ్యకు భక్తులు అభిషేకాలు నిర్వహిస్తుంటారు. రోజూ చేసే అభిషేకాల కన్నా తన పుట్టినరోజున చేసే అభిషేకంతో కన్నయ్య మరింత సంతోషించి భక్తుల కోరికలు నెరవేరుస్తారని అంటారు.
అసలు అభిషేకం ఎలా చేయాలి?
కన్నయ్యకు అభిషేకం ఎలా చేయాలి అనే దానిపై కొందరికి సందేహాలు ఉంటాయి. ఓ పెద్ద శుభ్రమైన పాత్ర తీసుకోవాలి. స్టీల్ కాకుండా మరే మెటల్ అయినా పర్వాలేదు. గంగాజంలో కాసిన్ని తులసి దళాలు వేసి కన్నయ్య విగ్రహంపై నెమ్మదిగా పోయాలి. ఆ తర్వాత పాలు, నెయ్యి, పండ్లు, తేనె, చక్కెర కలిపిన పంచామృతంతో అభిషేకం చేయాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి. అభిషేకం చేయడానికి భారీ విగ్రహాన్ని కాకుండా చిన్న గోపాలుడి విగ్రహాన్నే ఎంచుకోవాలి. పంచామృతంతో అభిషేకం అయ్యాక మరోసారి గంగాజలంతో కన్నయ్య విగ్రహాన్ని తడపండి. (krishnashtami)
అభిషేకం చేస్తున్నప్పుడు ఓం కృష్ణాయనమః అని కానీ నమో భగవతే వాసుదేవాయ నమః అని కానీ స్మరిస్తూ ఉండాలి. అభిషేకం పూర్తయ్యాక ఒక శంఖంలో పన్నీరు పోసి కన్నయ్య విగ్రహం ముందు పెట్టండి. విగ్రహాన్ని శుభ్రంగా తుడిచి మీ దగ్గర ఉన్న ఆభరణాలు, నెమలి పింఛం, బాన్సురీలతో అలంకరించండి. చందనంతో గోపాలుడి నుదుటన బొట్టు పెట్టండి. ఇక గోపాలుడి పాటలతో మీకు నచ్చినంత సేపు భజన చేయండి. మీరు ఏ పాత్రలో అయితే అభిషేకం చేసారో అందులో ఉన్న గంగాజలం, పంచామృతాన్ని ఒక గిన్నెలో పోసి దానిని ప్రపాదంగా పంచండి.
పాటించాల్సిన నియమాలు
కృష్ణుడిని పూజించే సమయంలో ఆయన నామాన్ని మీరు కూడా చందనంతో పెట్టుకోవాలి.
బాన్సురి, పింఛం లేకుండా కన్నయ్య విగ్రహాన్ని పెట్టకూడదు. (krishnashtami)
కన్నయ్యకు తలసి దళాలంటే ఇష్టం. ఆయనకు అభిషేకం చేసే సమయంలో ఈ దళాలను తప్పకుండా వేయాలి.
హరతి ఇచ్చిన తర్వాత కన్నయ్యను ఊయలలో వేసి ఊపుతూ భజన చేయండి.