Psychology Tips: కారణం లేకపోయినా నవ్వుతున్నారా..?
Hyderabad: కొన్ని సైకాలజీ టిప్స్‌ని (psychology tips) బట్టి ఎదుటివారి ప్రవర్తన ఎలాంటిదో చెప్పేయచ్చట. అలాంటి టిప్స్‌ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అంటున్నారు సైకాలజిస్ట్‌లు. ఎవరికి ఉపయోగం అనుకుంటున్నారా? దీని ద్వారా ఎదుటి వ్యక్తి ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో తెలిస్తే మనకు చేతనైన సాయం చేయచ్చు కదా.. ! ఇంతకీ ఆ టిప్స్ ఏంటో చూద్దాం.
*ఎదుటి వ్యక్తి కారణం ఉన్నా లేకపోయినా పగలబడి నవ్వుతున్నారనుకోండి..వారు మనసులో కొండంత బాధ, బరువు మోస్తున్నారని అర్థం.
*ఒక వ్యక్తి ఎక్కువ సేపు నిద్రపోతున్నారంటే వారు బాధలో ఉన్నారని అర్థం. మేల్కొని ఉంటే దానినే తలుచుకుని ఏడ్చేస్తుంటారు ఇలాంటివారు.
*ఒక మనిషి తక్కువగా మాట్లాడినా ఫాస్ట్‌గా మాట్లాడుతుంటే అతను ఏదో దాస్తున్నాడని అర్థం.
*ఒక వ్యక్తి కనీసం ఏడవలేకపోతుంటే అతను వీక్ అని అర్థం.
*తినేటప్పుడు సరిగ్గా కూర్చుని తినట్లేదంటే వాళ్లు ఏదో టెన్షన్లో ఉన్నారని అర్థం.
*చిన్న చిన్న విషయాలకే ఏడుస్తున్నారంటే వాళ్లు చాలా సెన్సిటివ్. అలాంటివారితో చాలా జాగ్రత్తగా ఆచి తూచి వ్యవహరించాలి.
*ఒక వ్యక్తి ప్రతి చిన్న విషయానికి కోప్పడుతుంటే లేదా చిరాకుపడుతుంటే వారికి ప్రేమగా పలకరించేవారు కావాలని అర్థం.