Lord Krishna: ఆరోగ్యం, ఐశ్వర్యం కోసం..!
ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలంటే ఈ పవర్‌ఫుడ్ కృష్ణుడి (lord krishna) మంత్రాలు బుధవారం నాడు జపిస్తే ఎంతో మంచిదట. ఈ మంత్రాలను రోజూ విన్నా, జపించినా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఎలాంటి నెగిటివ్ ఆలోచనలు రావు.
హరేకృష్ణ మహా మంత్రం
హరేకృష్ణ హరేకృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
హరే రామ హరే రామ రామ రామ హరే హరే
కొన్నిసార్లు మానసిక డిసిప్లైన్ అనేది లేకపోతే మన మెదడే మనకు శత్రువులా మారిపోతుంది. ఈ నామాన్ని జపిస్తే మనసు, మైండ్ రెండూ ప్రశాంతంగా ఉంటాయి. ఈ మంత్రం జపిస్తే మోక్షం లభిస్తుందని పెద్దల మాట. (lord krishna)
శ్రీకృష్ణ సఫల్తా మంత్రం
ఓం శ్రీకృష్ణః శరణం మమ
ఈ మంత్రం జపిస్తే ముందు నెగిటివిటీ అనేది తొలగిపోతుంది. పాజిటివ్‌గా ఆలోచించడం మొదలుపెడతారు. ఒత్తిడి కూడా తగ్గుతుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే ఏదైనా ఆలోచించగలుగుతాం.. మంచి నిర్ణయాలను తీసుకోగలుగుతాం అనేది గుర్తుపెట్టుకోండి.
కృష్ణ గాయత్రి మంత్రం
ఓం దేవికానందనాయే విద్మహే
వాసుదేవామ ధీమహీ
తన్నో కృష్ణ ప్రచోదయాత్
మీ మనసులో ఏవైనా సందేహాలు, అనుమానాలు ఉన్నాయనుకోండి.. ఈ మంత్రాన్ని చదువుకోండి. మనసు మైండ్ క్లియర్ అవుతుంది. ఈ మంత్రం సర్వరోగ నివారిణి అని కూడా అంటారు. (lord krishna)
కృష్ణ మూల మంత్రం
ఓం కృష్ణాయ నమః
వివిధ ఆలోచనలతో పరుగులు పెడుతున్న మనసును, మైండ్‌ను కంట్రోల్ చేసే శక్తి ఈ మంత్రానికి ఉంది. మనమేంటో మనకు తెలిసేలా చేస్తుంది.