Pashupatinath: వేరే దేశంలో ఉన్న ఏకైక జ్యోతిర్లింగం!
Hyderabad: జ్యోతిర్లింగాలు 12 అన్న విషయం అందరికీ తెలిసిందే. వాటిలో 11 మన భారతదేశంలోనే ఉన్నాయి. కానీ ఈ 12వ జ్యోతిర్లింగం మాత్రం నేపాల్లో (nepal) ఉంది. అదే పశుపతినాథుడి ఆలయం. (pashupatinath). ప్రతి సంవత్సరం మహా శివరాత్రి సమయానికి లక్షల్లో ఈ ఆలయానికి వెళ్తుంటారు భక్తులు. ఎక్కువగా జీవిత చరమాంకంలో ఉన్నవారు, ప్రాణాంతకమైన వ్యాధులతో బాధపడేవారు ఈ ఆలయానికి వెళ్తుంటారట. అలా అక్కడే చనిపోయేంతవరకు ఉంటారట. అక్కడి పవిత్రమైన భాగమతి నదీతీరాన అంత్యక్రియలు నిర్వహిస్తే వారి ఆత్మకు శాంతి లభిస్తుందని భక్తుల నమ్మకం.
పశుపతినాథుడి (pashupatinath) ఆలయ ప్రాంగణంలో చనిపోతే వచ్చే జన్మలో మళ్లీ మానవుడిగా పుడతారని భక్తుల నమ్మకం. అంతేకాదు.. ఈ ఆలయం ప్రాంగణంలో ఉండే జ్యోతిష్యులు… తమ దగ్గర జ్యోతిష్యం చెప్పించుకోవడానికి వచ్చే వాళ్లు ఎప్పుడు చనిపోతారో కూడా కరెక్ట్ తేదీ సమయంతో సహా చెప్పగలరట. ఈ ఆలయంలో చెక్కతో తయారుచేసిన విగ్రహాలను మొక్కుకుంటే కోరికలు తీరతాయని భక్తుల నమ్మకం. ఆలయంలో బంగారంతో తయారుచేసిన నంది విగ్రహం చూడముచ్చటగా ఉంటుందట.
మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. భాగమతి నదీ తీరాన మహిళలు బట్టలు ఉతుక్కుంటూ ఉంటారట. ఎందుకంటే.. ఆ అంత్యక్రియలు ఒడ్డున నిర్వహిస్తారు కాబట్టి మనిషి శవం కాలిపోయి నదిలో ప్రవహిస్తుంటుందట. దాని వల్ల బట్టలకు ఉన్న మురికి సులభంగా వదిలిపోతుందట. ఎందుకంటే మనిషి అవయవాల్లో ఎక్కువగా జంతువు కొవ్వు ఉంటుందని దాని వల్లే మురికిపోతుందని అనుకుంటారట. సోపులు కూడా అలా తయారుచేసినవే అని చెప్తుంటారు. (pashupatinath)