సూర్యాస్తమయ వేళలో ఈ పనులు అస్సలు చేయకండి
వాస్తుశాస్త్రం ప్రకార సూర్యాస్తమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదట. సూర్యాస్తమయం అంటే సూర్యుడు అస్తమించే సమయం అని మనకు తెలిసిందే. అంటే పగలు పోయి రాత్రి వస్తుందని అర్థం. రాత్రి అంటే చీకటి కాబట్టి ఈ సమయంలో కొన్ని పనులను చేయకుండా ఉంటే మంచిది. అవేంటంటే.. (vastu)
గోళ్లు, జుట్టు కత్తిరించకూడదు
సూర్యాస్తమయం వేళలో గోళ్లు కట్ చేసుకోవడం, జుట్టు కత్తిరించుకోవడం వంటివి అస్సలు చేయకండి. ఇది అష్టదరిద్రంతో సమానం. దరిద్రాన్ని మీకు మీరే నెత్తికి ఎక్కించుకున్నట్లు అవుతుంది. ఇలా చేస్తే లక్ష్మీదేవిని అవమానించినట్లు అవుతుందని వాస్తుశాస్త్రం చెప్తోంది.
ఎంగిలి గిన్నెలు ఉండకూడదు
సూర్యాస్తమయానికి ఎంగిలి చేసిన గిన్నెలు అంటే తినేసి పడేసిన అంట్లు అలాగే వదిలేయకూడదట. ఒకవేళ తోముకోలేకపోతే.. వాటిని కనీసం వంటగదిలో మాత్రం అలాగే పెట్టకండి. లక్ష్మీదేవి ఇంట్లో తాండవం ఆడాలంటే ముందు మన వంటిల్లు శుభ్రంగా కళకళలాడుతూ ఉండాలి. ఎప్పటికప్పుడు నీట్‌గా పెట్టుకుంటూ ఉండాలి. (vastu)
ఊడవకూడదు
సూర్యాస్తమయంలో మన ఇళ్లల్లో లైట్లు వెలుగుతూ ఉంటాయి. ఆ సమయంలో చీపురుతో ఇల్లు ఊడవకూడదు. ఇలాంటి పనులు ఉదయాన్నే ఊడ్చేసుకోండి.
తలస్నానం వంటివి చేయకూడదు
సూర్యాస్తమయం వేళల్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందట. అలాంటి సమయంలో తలకు నూనె రాయడం, తలంటుకోవడం.. దువ్వుకోవడం వంటివి చేయకూడదట. కావాలంటే మధ్యాహ్నం 3 నుంచి 5 లోపు ఎప్పుడైనా చేసుకోండి. తల విరబోసుకుని కూడా పడుకోకూడదట. (vastu)
దుస్తులు ఉతక్కూడదు
దుస్తులను ఉతకడం వంటివి కూడా చేయకూడదు. ఇవన్నీ ఉదయాన్నే చేసేసుకోండి. ఇలా సూర్యాస్తమయం వేళల్లో బట్టలు ఉతికే పని పెట్టుకుంటే ఇంట్లో డిప్రెషన్ వంటి సమస్యలు వస్తాయి.