Vinayaka Chavithi: గణనాథుడిని ఇంటికి తెచ్చుకునేటప్పుడు ఈ రూల్స్ పాటించాల్సిందే
Vinayaka Chavithi: సెప్టెంబర్ 7న వినాయక చవితి ఘనంగా జరుపుకుంటాం. ఇందుకోసం రెండు రోజుల ముందే గణనాథుడి విగ్రహాన్ని తెచ్చిపెట్టుకుంటూ ఉంటారు. అయితే విగ్రహాన్ని తెచ్చుకునే సమయంలో ఈ నియమాలు తప్పనిసరిగా పాటించాలట. అవేంటంటే..
విగ్రహాన్ని పెట్టే స్థలాన్ని శుభ్రం చేసుకోవాలి. గంగా జలంతో శుద్ధి చేస్తే మరీ మంచిది
మట్టితో చేసిన గణనాథుడిని తెచ్చుకోవడమే ఉత్తమం.
విగ్రహాన్ని తెచ్చామా పెట్టామా అన్నట్లు కాకుండా.. ఆయన్ను ఇంట్లోకి ఆహ్వానించాలి. ఇందుకోసం మీకు తెలిసిన గణనాథుడి మంత్రాలు చదవడం.. లేదా పూజారిని పిలిపించి ప్రత్యేక పూజ చేయించడం వంటివి చేస్తే మరీ మంచిది.
తాజా పువ్వులు, పండ్లు, పత్రితోనే పూజించాలి. ప్లాస్టిక్ పూలు వంటివి పెట్టకూడదు
వినాయక చవితి రోజన ఘనంగా పూజ అందరూ చేస్తారు. అయితే కొందరు మూడు రోజుల పాటు పెట్టుకుంటారు. మరికొందరు 11 రోజులూ పెడతారు. అయితే చవితి రోజునే కాకుండా వినాయకుడి విగ్రహం ఇంట్లో ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులూ పూజ చేసి తప్పనిసరిగా నైవేధ్యాలు పెట్టాలి.
విగ్రహాన్ని ఎక్కడ పడితే అక్కడ కాకుండా తూర్పు లేదా ఉత్తర భాగంలో ప్రతిష్ఠించాలి.