Durgashtami: కోరికలు నెరవేర్చే అమ్మవారి మంత్రాలు
నవరాత్రుల (navratri) సమయంలో అమ్మవారిని వివిధ అలంకారాల్లో పూజిస్తాం. వివిధ మంత్రాలను కూడా జపిస్తాం. అయితే కోరిన కోర్కెలు తీరాలంటే ఈ నవరాత్రుల పర్వదినాల్లో ఈ మంత్రాలను జపించాలట. (durgashtami)
మంత్రాలను జపించడం ద్వారా మానసిక ఆరోగ్యంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. అదెలాగంటే.. మంత్రాలన్నీ కూడా సంస్కృతంలో ఉంటాయి. మనం తెలుగులో చదవడానికే మధ్య మధ్యలో పలకడం కాస్త కష్టంగా ఉంటే గ్యాప్ ఇస్తుంటాం. అలాంటిది సంస్కృతంలో చదవాలంటే ఉచ్ఛరణ ఇంకా బాగా రావాలి. అది ఇంకా కష్టం. అందుకే అలవాటు లేని వారు మంత్రాలు జపించే సమయంలో నిదానంగా పలుకుతూ ఉంటారు. అలా పలికినప్పుడు మనం తీసుకునే శ్వాసలో కూడా మార్పు ఉంటుంది. దాని వల్ల మంత్ర ఉచ్ఛారణ అనేది మనకు ఒకరంగా బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్‌లా పనిచేస్తుంది. అంతేకాదు.. దేవుడి పాటల కంటే మంత్రాలు వినడం వల్ల మనసుకి ఎంతో ప్రశాంతత లభిస్తుంది. (durgashtami)
కోరికలు నెరవేర్చే అమ్మవారి మంత్రాలు ఇవే..!
మొదటి రోజు – మాతా శైలపుత్రి
ఓం దేవి శైలపుత్రే నమః
యా దేవీ సర్వ భూతేషు మా శైలపుత్రి రూపేణ సంస్థితా
నమస్త్యే నమస్త్యే నమస్త్యే నమః
రెండో రోజు – దేవి బ్రహ్మచారిణి
ఓం దేవీ బ్రహ్మచారిణి నమః
యా దేవీ సర్వభూతేషు మా బ్రహ్మచారిణి రూపేణ సంస్థితా
నమస్త్యే నమస్త్యే నమస్త్యే నమః (durgashtami)
మూడో రోజు – చంద్రగంటా దేవి
ఓం దేవి చంద్రగంటాయై నమః
యా దేవీ సర్వభూతేషు చంద్రగంటాయై రూపేణ సంస్థితా
నమస్త్యే నమస్త్యే నమస్త్యే నమః
నాలుగో రోజు – కూష్మాండా దేవి
ఓం దేవీ కూష్మాండై నమః
యా దేవీ సర్వభూతేషు మా కూష్మాండ రూపేణ సంస్థితా
నమస్త్యే నమస్త్యే నమస్త్యే నమః (durgashtami)
ఐదో రోజు – స్కంద మాతా దేవి
ఓం దేవీ స్కందమాతై నమః
యా దేవీ సర్వభూతేషు మా స్కందమాత రూపేణ సంస్థితా
నమస్త్యే నమస్త్యే నమస్త్యే నమః
ఆరో రోజు – కత్యాయినీ దేవి
ఓం దేవీ కత్యాయినై నమః
యా దేవీ సర్వభూతేషు మా కత్యాయిని రూపేణ సంస్థితా
నమస్త్యే నమస్త్యే నమస్త్యే నమః
ఏడో రోజు – కాళరాత్రీ దేవి
ఓం దేవీ కాళరాత్రై నమః
యా దేవీ సర్వభూతేషు మా కాళరాత్రి రూపేణ సంస్థితా
నమస్త్యే నమస్త్యే నమస్త్యే నమః (durgashtami)
ఎనిమిదో రోజు – మహాగౌరి దేవి
ఓం దేవీ మహాగౌరై నమః
యా దేవీ సర్వభూతేషు మా మహాగౌరి రూపేణ సంస్థితా
నమస్త్యే నమస్త్యే నమస్త్యే నమః
తొమ్మిదో రోజు – సిద్ధిధాత్రి దేవి
ఓం దేవీ సిద్ధిధాత్రై నమః
యా దేవీ సర్వభూతేషు మా సిద్ధిధాత్రి రూపేణ సంస్థితా
నమస్త్యే నమస్త్యే నమస్త్యే నమః (durgashtami)