Lord Shani: శనివారం ఈ మంత్రాలు చదివితే మంచిది
శని దేవుడు (lord shani) అనగానే చాలా మంది భయపడుతుంటారు. శని తలపై ఉంటే దరిద్రమే అనుకుంటాం. కానీ శని చేసేది ఒకందుకు మన మంచికే. మనం చేసే పనులను బట్టే శని దేవుడు ఏమివ్వాలో అవి ఇచ్చేస్తుంటాడు. శనివారం నాడు ఆయన మంత్రాలు జపిస్తే ఎంతో మంచిదట. ఆ మంత్రాలేంటంటే….
శని బీజ మంత్రం
ఓం ప్రాం ప్రీం ప్రౌం సాహః శనైశ్రాయ నమః
ఈ మంత్రం శనివారం నాడు జపించడం వల్ల మనకు నిబద్ధత కలుగుతుంది. ఏం పనులు చేస్తే ఎలాంటి ఫలితాలు అనుభవించాలో ఒక ఐడియా వస్తుంది. ఆయన మనపై ఎలాంటి చెడు ప్రభావం చూపించకుండా శాంతింపజేయడానికి ఈ బీజ మంత్రం జపించండి. (lord shani)
శని మూల మంత్రం
ఓం శం శనైశ్చరాయ నమః
శని ప్రభావం ఉన్న రాశుల వారు ఈ మంత్రాన్ని జపిస్తే అన్ని సమస్యలు తొలగిపోతాయి.
శని మహా మంత్రం
నిలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం
ఛాయ మార్తాండ సంభుతం తమ్ నమామి శనైశ్చరం
ఈ మంత్రాన్ని ఎన్ని సార్లు జపిస్తే అంత మంచిది. శని ప్రభావం తగ్గి వెంటనే మార్పులు కనిపిస్తాయి. (lord shani)
శని గాయత్రి మంత్రం
ఓం కాకద్వజాయ విద్వహే ఖడ్గ హస్తాయ ధీమహి తన్నో మండ ప్రచోదయాత్
జీవితంలో ఏం చేసినా ఎలాంటి ఫలితాలు లేనప్పుడు ఈ శని గాయత్రి మంత్రం పఠిస్తే ఆటంకాలు తొలగుతాయట. రోజూ ఈ మంత్రాన్ని చదివితే ఇంకా మంచిది. (lord shani)