Lifestyle: అబ్బాయిలూ.. ఈ విషయాల్లో కాస్త జాగ్రత్త!
Hyderabad: సాధారణంగా ఆడవాళ్లకి ఫీలింగ్స్, ఎమోషన్స్ ఎక్కువ అనుకుంటారు కానీ నిజానికి అబ్బాయిలకే (lifestyle tips for men) అవి ఎక్కువగా ఉంటాయి. కానీ బయటపడరు. ఎంత బాధైనా మనసులోనే దాచుకుంటారు. అది ఒక రకంగా మంచిదే అయినప్పటికీ.. ఈ కింద చెప్పిన అంశాలు మీకూ ఉన్నట్లైతే మీరు కాస్త జాగ్రత్తగా ఉండాలి.
*కొందరు అబ్బాయిలు ఎవ్వరితో మాట్లాడేందుకు ఆసక్తి చూపించరు. ఇలాంటివారు ఎదుటివాళ్లు హేళన చేస్తున్నట్లు మాట్లాడుతున్నా పట్టించుకోరు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు. ఎవ్వరికీ మిమ్మల్ని చులకనగా చూసే ఛాన్స్ అస్సలు ఇవ్వకండి.
*అబ్బాయిలు ఏడవరు అనేది అపోహ. అబ్బాయిలు మాత్రం మనుషులు కారా? వారికి మాత్రం ఫీలింగ్స్ ఉండవా? అందుకే ఏడిస్తే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనుకుని మీలో మీరే బాధపడుతూ కూర్చోకండి. ఏడవాలి అనిపిస్తే ఏడ్చేయండి. బెటర్‌గా ఫీలవుతారు.
*కనీసం వారంలో నాలుగు రోజులు ఎక్సర్‌సైజ్ చేయండి. ఏమీ చేయకుండా అలా దిగాలుగా కూర్చుని ఉంటే శారీరకంగా మానసికంగా మరింత కుంగిపోతారు.
*రోజంతా ఒకే గదిలో కూర్చుని వీడియో గేమ్స్ ఆడుకుంటూ కూర్చుంటారా? ఇది అస్సలు మంచి పద్ధతి కాదు. ఇంట్లో వారితో ఫ్రెండ్స్‌తో తరచూ కలుస్తూ ఉండండి.
*పార్న్ చూసే అలవాటు ఉంటే వెంటనే మానుకోవడం బెటర్. ఒక మనిషిని మెంటల్‌గా డిస్టర్బ్ చేసేది ఈ పోర్నోగ్రఫీనే. మిమ్మల్ని డీమోటివేట్ చేసే అంశం ఇది.
*తల్లిదండ్రులతో అగౌరవంగా మాట్లాడుతున్నారా? మీరు మానసికంగా ఎంత బాధనైనా పడుతుండవచ్చు. అలాంటప్పుడు వారితో కూర్చుని మీ బాధలు చెప్పుకుంటే సమస్య తీరుతుంది కానీ వారిని తిడితే మరింత బాధకలుగుతుంది.