Lakshmi Devi: ఇలా చేస్తే ల‌క్ష్మీదేవి ఇంట నిల‌వ‌దు

ల‌క్ష్మీ క‌టాక్షం (lakshmi devi)  క‌ల‌గాల‌ని ప్ర‌తి ఇల్లు కోరుకుంటుంది. అయితే మ‌నం ఎన్ని పూజ‌లు చేసినా.. ఎన్ని మంచి ప‌నులు చేసినా.. ఇంట్లో చేసే కొన్ని ప‌నుల వ‌ల్ల ల‌క్ష్మీదేవికి కోపం వ‌చ్చి ఇంట్లో నుంచి వెళ్లిపోతుంద‌ట‌. ఆ ప‌నులేంటో చూద్దాం.

బెడ్ కాఫీ లాగా ఈ మ‌ధ్య‌కాలంలో బెడ్ మీల్స్ కూడా చేసేస్తున్నారు. అంటే అన్నీ బెడ్ ద‌గ్గ‌రికే వ‌చ్చేస్తాయి. ప‌రుపుపై కూర్చుని తిన‌డం వంటివి చేయ‌కూడ‌దు. అది అష్ట‌ద‌రిద్ర‌మం అనే చెప్పాలి. ఇలా చేస్తే ల‌క్ష్మీదేవికి కోపం వ‌స్తుంది. అదే బెడ్‌పై కూర్చుని డ‌బ్బు లెక్క‌పెట్ట‌డం వంటివి చేయ‌కండి. కావాలంటే నిల‌బ‌డి లెక్క‌పెట్టుకోండి.. అంతేకానీ బెడ్‌పై కూర్చుని మ‌నీ కౌంట్ చేయ‌డం.. చిల్ల‌రను దిండు కింద మంచంపైన ఉంచ‌డం లాంటివి అస్స‌లు చేయ‌కండి. బెడ్‌పై కూర్చుని చ‌దువుకోవ‌డం, వ‌ర్క్ చేయడం కూడా మంచి పద్ధ‌తి కాద‌ట‌. పుస్త‌కాలు స‌రస్వ‌తి దేవితో స‌మానం. అలాంటి పుస్త‌కాల‌ను రోజూ నిద్ర‌పోయే బెడ్‌పై పెట్టడం త‌ప్పు. (lakshmi devi)

ఇలాంటి మూఢ‌న‌మ్మ‌కాలు ఇప్ప‌టికీ న‌మ్ముతున్నారా? అని మీరు అనుకుంటూ ఉండ‌వ‌చ్చు. ఇవి మూఢ‌న‌మ్మ‌కాలో కాదో.. అన్న విష‌యం ప‌క్క‌న‌పెడితే.. ఇవి చేయ‌కుండా ఉండ‌టం పెద్ద క‌ష్ట‌మైన ప‌నేమీ కాదు. తెలిసి తెలిసి చిన్న చిన్న విష‌యాల‌ను కూడా లెక్క‌చేయ‌కపోతే దాని ఎఫెక్ట్స్ మ‌న‌కు తెలీకుండానే జ‌రిగిపోతుంటాయి.