Lakshmi Devi వీరిని మాత్ర‌మే క‌రుణిస్తుంద‌ట‌..!

ల‌క్ష్మీదేవి (lakshmi devi) క‌టాక్షం ఎల్ల‌ప్పుడూ త‌మ‌పై ఉండాల‌ని కోరుకోనివారు ఉండ‌రు. అయితే ల‌క్ష్మీదేవి క‌టాక్షం పొందాలంటే ఆ త‌ల్లి పాటించే కొన్ని నియ‌మాలు భ‌క్తులు కూడా పాటించాల్సి ఉంటుంద‌ట‌. అవేంటో తెలుసుకుందాం.

ధ్యానం

ధ్యానం అనేది జీవితంలో ఒక భాగంగా చేసుకోవాలి. ఈ ధ్యానం అనేది ఇప్పుడిప్పుడు వ‌చ్చింది కాదు. 3000 ఏళ్ల కంటే ఎక్కువ సంవ‌త్స‌రాల క్రితంది. మ‌హ‌ర్షులు, దేవ‌త‌లు కూడా భూలోకంలో ఉన్న‌ప్పుడు ధ్యానాలు చేస్తుండేవారు.

సింపుల్ జీవితం

ఎంత ఉన్నా కూడా ఉన్న‌దానితో సంతృప్తిప‌డుతూ ఉండాలి అంటుంటారు. ల‌క్ష్మీదేవి పాఠించే నియ‌మం కూడా ఇదే. ఆ త‌ల్లికి సింపుల్ జీవితాలు గ‌డిపే భ‌క్తులంటే మ‌క్కువ‌. (lakshmi devi)

నిబ‌ద్ధ‌త‌

మ‌నం ఏ విష‌యంలోనైనా విజ‌యం సాధించాలంటే దాని ప‌ట్ల నిబ‌ద్ధ‌త ఉండాలి. ఇష్టం లేని పని చేస్తూ.. దానిపై ఎలాంటి ఎఫ‌ర్ట్ పెట్ట‌కుండా నాకు స‌క్సెస్ వ‌చ్చేయాలి అంటే అవ్వ‌దు.

ధైర్యం

ధైర్యంగా ఉండేవారికి ల‌క్ష్మీదేవి పోరాడే శ‌క్తిని ఇస్తుంద‌ట‌. స‌మ‌స్య‌లను అధిగ‌మించే దిశ‌గా అడుగులు వేయిస్తుంది.