ఇంట్లో నెగిటివ్ ఎన‌ర్జీ ఉంద‌ని ఎలా తెలుస్తుంది?

Vastu Tips: మ‌న ఇల్లు చూడ‌టానికి బాగానే ఉన్న‌ప్ప‌టికీ ఏదో తెలీని లోపం (spiritual). ఇంట్లో ఉంటున్నా మ‌న‌శాంతి ఉండ‌దు. ఇందుకు కార‌ణం ఇంట్లోకి ప్ర‌వేశించిన నెగిటివ్ శ‌క్తులే అని అంటున్నారు వాస్తు నిపుణులు. నెగిటివ్ శ‌క్తులు ఇంట్లోకి ప్ర‌వేశించాయి అని తెలుసుకునేందుకు కొన్ని చిట్కాలు కూడా ఉన్నాయి.

*ఎంత క‌ష్ట‌ప‌డుతున్నా అడుగ‌డుగునా ఏదో ఒక అడ్డంకి రావ‌డం. చేతికి దాకా వ‌చ్చి చేజారిపోవ‌డం వంటివి అవుతుంటే క‌చ్చితంగా ఇంట్లో నెగిటివ్ ఎన‌ర్జీ ఉంద‌ని అర్థం.

*క‌ళ్ల ముందు ఎన్నో అవ‌కాశాలున్నా కాన్ఫిడెన్స్ లేక‌పోవ‌డం.  (spiritual)

*ఇంట్లో ఎవ‌రైనా మాన‌సికంగా బాధ‌ప‌డుతుంటే వారికి ఎలాంటి థెర‌పీ, ట్రీట్మెంట్ ఇచ్చినా బాగ‌వ్వ‌క‌పోవ‌డం.

*స‌రిగ్గా మంచి ఫ‌లితాలు అందుకునే స‌మ‌యానికి ఇక చేయ‌డం కూడా వేస్టే అని మ‌ధ్య‌లోనే వ‌దిలేయ‌డం.

*కుటుంబ క‌ల‌హాలు. (spiritual)

నెగిటివ్ ఎన‌ర్జీని ఇలా వ‌దిలించుకోండి

*మీ ఇంట్లోని గ‌ది మూల‌ల్లో కాస్త రాళ్ల ఉప్పు వేసి ఉంచండి. 48 గంట‌ల త‌ర్వాత తీసేయండి.

*ఇంటి ప్ర‌ధాన ద్వారం ముందు ఒక గంటను ఏర్పాటుచేయండి. ఆ సౌండ్ వ‌ల్ల పాజిటివ్ వైబ్రేష‌న్స్ క‌లుగుతాయి.

*ఇంట్లో విరిగిపోయిన పాడైపోయిన సామాన్లు ఏమ‌న్నా ఉంటే వెంట‌నే తీసి పారేయండి.

*ప‌సుపు రంగు శుభానికి సూచ‌కం. ఇంట్లోని గ‌దుల్లో లేత ప‌సుపు రంగుతో పెయింట్ వేయించండి.

*గ‌దుల్లోని అన్ని మూల‌ల్లో ధూపం వేస్తూ ఉండండి.