Vadakkunnathan: ఈ ఆలయాన్ని ఒక్కసారి దర్శిస్తే…
Hyderabad: ఈ ఆలయంలో శివ లింగంపై నెయ్యితో అభిషేకం చేస్తే ఆ నెయ్యి ఎండాకాలంలోనూ కరగదట (vadakkunnathan). ఇంతకీ ఈ ఆలయం ఎక్కడుంది? దీనిని ప్రత్యేకతలు ఏంటి? తెలుసుకుందాం.
ఈ ఆలయం పేరు వడక్కున్నాథన్ ఆలయం. కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఉంది. కొన్ని వందల ఏళ్ల క్రితం త్రిశూర్‌ని తిరు శివ పేరూర్‌గా పిలిచేవాళ్లు. అంటే శివయ్య నగరం అని అర్థం. అది రాను రాను త్రిశూర్‌గా మారిపోయింది. ఈ త్రిశూర్ జిల్లాలోనే వడక్కున్నాథన్ ఆలయం ఉంది. వడక్కున్నాథన్ అంటే ఉత్తర దిశాన ఉండే దైవం అని అర్థమట. (vadakkunnathan)
మొత్తం 9 ఎకరాల్లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఆలయంలో ఓ పెద్ద కారిడార్ కూడా నిర్మించారు. ఈ కారిడార్‌ను చుట్టాంబళం అని అంటారు. ఈ చుట్టాంబళంలో కృష్ణుడు, పరశురాముడు, సింహోదర, అయ్యప్ప, వెట్టెక్కారన్, ఆది శంకర ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాన్ని సందర్శిస్తే రామేశ్వరం, కాశీని దర్శించుకున్నంత పుణ్యమట. ఈ ఆలయంలో ఉండే లింగానికి నెయ్యితో అభిషేకాలు జరుగుతాయి. అయితే.. లింగంపై పోసిన నెయ్యి కరగకుండా అలాగే ఉంటుందట. ఎండాకాలంలోనూ ఆ నెయ్యి కరగదట. దాంతో లింగం మొత్తం 2 మీటర్ల మేర నెయ్యితో కప్పబడి ఉంటుంది. (vadakkunnathan)
ఈ ఆలయంలో అనయుట్టు పూజలు ప్రత్యేకం. అంటే ప్రత్యేకించి ఏనుగులను పూజిస్తారు. వాటికి ఆహారాన్ని తినిపిస్తారు. జులై నుంచి ఆగస్ట్ మధ్యలో ఈ అనయుట్టు పూజలు ప్రత్యేకంగా నిర్వహిస్తారు. త్రిశూర్ పూరమ్ అనే పండుగ సందర్భంలో మాత్రం దాదాపు 15 ఆలయాల నుంచి ఏనుగులను ప్రత్యేకంగా అలంకరించి వడుక్కన్నాథన్ ఆలయం వైపు ఊరేగిస్తారట. ఈ త్రిశూర్ పూరమ్ అనే పండుగ చూడటానికి కన్నుల పండువలా ఉంటుందట. (vadakkunnathan)