సక్సెస్ కోసం ఈ వాల్‌పేపర్లు పెట్టుకోవాలట
సక్సెస్ కోసం మన కృషితో పాటు కాస్త దైవ శక్తి కూడా తోడైతే ఆ మనిషికి ఇక తిరుగే ఉండదు. ఎంత కష్టపడుతున్నా ఏమీ చేయలేకపోతున్నామంటే మనకు యూనివర్స్ సహకరించడంలేదని అర్థం. కాస్త ఆధ్యాత్మికత కూడా తోడవ్వాలి. అందుకే చాలా మంది ఇళ్లల్లో సక్సెస్ కోసం వివిధ రకాల పెయింటింగ్స్, ఫోటో ఫ్రేమ్స్ చేయించి పెట్టుకుంటూ ఉంటారు. ఇలాంటి ఫోటోలను మన ఫోన్, ల్యాప్‌టాప్ వాల్‌పేపర్లుగా పెట్టుకున్నా కూడా మంచిదేనట. ఇంతకీ ఎలాంటి వాల్‌పేపర్లు పెట్టుకోవాలి? (spiritual)
గోల్డెన్ మండల
ముగ్గులా కనిపించే మండలను వాల్‌పేపర్‌గా పెట్టుకుంటే ఎంతో మంచిదట. గోల్డెన్ రంగులో ఉన్న మండలాను పెట్టుకుంటే సక్సెస్ వైపు బాటలు వేసేలా ప్రోత్సహిస్తుంది. ఆ ఫోటోను డౌన్‌లోడ్ చేసుకుని దానిపై ప్రాస్పరిటీ (prosperity) అని ఒక చక్కటి ఫాంట్‌తో టైప్ చేసి పెట్టుకుంటే మరీ మంచిది.
డబ్బులు
డబ్బులు వర్షంలా పడుతున్న ఫోటోలు కూడా చాలానే దొరకుతాయి. వాటిని కూడా వాల్‌పేపర్లుగా పెట్టుకుంటే మంచిది. ఇలాంటి వాల్‌పేపర్లు పెట్టుకుంటే డబ్బుకి ఏ కొదవా ఉండదు అంటుంటారు. (spiritual)
వెదురు అడివి
వెదురు (బాంబూ) చెట్లు పొదల్లా ఉన్న అడవి ఫోటోలు బోలెడు దొరకుతుంటాయి. వాటికి సంబంధించిన ఒక మంచి ఫోటోను వాల్‌పేపర్‌గా పెట్టుకోండి. ఈ వాల్‌పేపర్ అభివృద్ధి, విజయానికి సూచకం.
సూర్యోదయం
పర్వతాల మధ్య నుంచి సూర్యకిరణాలు పడుతున్న ఫోటోను వాల్‌పేపర్‌గా పెట్టుకున్నా మంచిదే. సూర్యోదయం అంటే రోజు మొదలవుతుందని అర్థం. అదే విధంగా మన జీవితంలో కూడా కొత్త అవకాశాలు వస్తాయి కొత్త జీవితం మొదలవుతుంది అని సూచిస్తుంది. (spiritual)
కమలం
కమలం పువ్వుల ఫోటోలను కూడా వాల్‌పేపర్‌గా పెట్టుకోవచ్చు. కమలంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుంది.
గోల్డెన్ తాళంచెవి
గోల్డెన్ తాళం చెవుల ఫోటోలు కూడా మంచివే. అంటే మీరు విజయం వైపు వెళ్లే తలుపులను తెరవబోతున్నారు అని అర్థం.
నక్షత్రాలు
రాత్రివేళల్లో ఆకాశం నక్షత్రాలతో నిండిపోయే ఫోటోను కూడా వాల్‌పేపర్‌గా పెట్టుకుంటే మంచిది. ఆకాశంలో లెక్కపెట్టలేనన్ని నక్షత్రాల మాదిరిగానే మనకూ బోలెడు అవకాశాలు ఉన్నాయని అర్థం.
అయితే వీటిని ప్లెయిన్ వాల్‌పేపర్లుగా కాకుండా ఆల్రెడీ వాటిపై సక్సెస్‌కి సంబంధించిన కోట్స్ రాసి ఉన్నవాటిని ఎంచుకుంటే మంచిది.