Spiritual: చనిపోయిన వాళ్లు మళ్ళీ అదే కుటుంబంలో పుడతారా?
Spiritual: ఇంట్లో ఎవరన్నా చనిపోతే.. ఆ తర్వాత వారు మళ్లీ అద కుటుంబంలో పుడతారని చాలా మంది నమ్ముతారు. అందుకే పెద్దలు.. వారికి మనవడు లేదా మనవరాలు పుడితే మా అమ్మా నాన్నలు మళ్లీ పుట్టారు అని చెప్తుంటారు. ఇందులో ఎంత నిజం ఉంది? అసలు ఇలా సాధ్యం అవుతుందా?
మన సనాతన ధర్మంలో పునర్జమ్మకు సంబంధించిన అద్భుతమైన విషయలు ఉన్నాయి. పుట్టిన ప్రతీ మనిషి కూడా గిట్టాల్సిందే. చనిపోయిన వారు మళ్లీ పుడతారు. సనాతన ధర్మంలో మన వేదాలు, ఉపనిషత్తులు ఇవన్నీ చెప్పాయి. మరి వాళ్లు ఎక్కడ పుడతారు? ఈ అంశం గురించి మన పూర్వీకులు చాలా చెప్పారు. ఒకవేళ చనిపోయిన వ్యక్తికి తీరాల్సిన రుణం ఉంటే అప్పుడు తప్పకుండా వారు ఏదో ఒక రూపంలో అదే కుటుంబంలో పుడతారట. అది మనిషిగా అయినా పుట్టచ్చు లేదా జంతువుగా అయినా పుట్టచ్చు.
చాలా మంది ఎలా ఆలోచిస్తారంటే.. ఇంట్లో తమ బిడ్డో, తల్లో, తండ్రో చనిపోతే.. మళ్లీ మరో పిల్లాడినో ఆడపిల్లనో కంటే వారు పుడతారు అని. ఇందులో ఏమాత్రం నిజంలేదు. ఇలా ఎవరు చెప్పినా కూడా నమ్మి మోసపోవద్దు. సనాతన ధర్మం ప్రకారం.. మన పూర్వీకులు చెప్పిన మాట ఏంటంటే.. చనిపోయిన వారికి మనకు రుణ సంబంధం ఇంకా తీరకపోతేనే ఏదో ఒక రకంగా వారు మళ్లీ అదే కుటుంబంలో జన్మిస్తారు.