Spiritual: ఆడవారు గాయత్రి మంత్రం జపించవచ్చా?
Spiritual: గాయత్రి మంత్రం ఎంతో శక్తివంతమైనది. రోజులో ఒకసారి ఈ మంత్రాన్ని జపించినా ఎంతో మంచిదని పురాణాలు చెప్తున్నాయి. కానీ ఈ మంత్రం విషయంలో చాలా మందికి ఉండే సందేహం ఏంటంటే.. ఆడవాళ్లు జపించవచ్చా అని. ఈ అంశం గురించి ఇప్పుడు చెప్పుకుందాం.
రిగ్వేదంలోని అత్యంత పురాతన మంత్రంగా గాయత్రి మంత్రాన్ని భావిస్తారు. సూర్యుడికి సంబంధించిన ఈ మంత్రాన్ని జపిస్తే జ్ఞానం, జ్ఞానోదయం రెండూ కలుగుతాయని చెప్తారు.
ఓం భూర్భువస్వః
తత్స వితుర్వరేణ్యం
భర్గో దేవస్య ధీమహి
ధియోయోనఃప్రచోదయాత్
ఈ మంత్రం శరీరంలోని కింది భాగం చక్రాలని యాక్టివేట్ చేస్తుంది. ఆడవారికి కింది భాగంలోనే గర్భ సంచి, యోని ఉంటాయి కాబట్టి.. ఈ మంత్రాన్ని ఆడవారు తప్పకుండా జపించాల్సిందే.