Spiritual: ఆరిపోయిన ఒత్తిని మళ్లీ వెలిగించవచ్చా?
Spiritual: దీప సెమ్మెలలో నిండుగా నూనె పోసి దీపం వెలిగిస్తుంటాం. గాలి రావడం వల్లో లేక ఒత్తి సరిగ్గా వెలగకపోవడం వల్లో అది కొండెక్కిపోతుంది (ఆరిపోతుంది). అలాంటప్పుడు మిగిలిపోయిన ఒత్తిని మళ్లీ వెలిగించవచ్చో లేదో తెలుసుకుందాం.
దీపం వెలిగించే సమయంలో ఆ దీపానికి ఎంతో విశిష్టత ఉంటుంది. ఒకవేళ దీపం ఆరిపోతే ఆ ఒత్తిని మిగిలిపోయిన నూనెను తీసేసి దీప సెమ్మెలను శుభ్రం చేసి మళ్లీ ఫ్రెష్‌గా వెలిగించాలే కానీ మిగిలిపోయిన దానిని మళ్లీ వెలిగించకూడదట. అలా చేస్తే ఆ పాజిటివిటీ పోతుందని నిపుణులు చెప్తున్నారు. దేవుడికి అప్పటికప్పుడు వండిన పదార్థాలను నైవేద్యంగా పెడతాం కానీ రాత్రి మిగిలిపోయినవి పెట్టం కదా..! అదే విధంగా దీపం కూడా ఎప్పటికప్పుడు పెట్టాలి కానీ మిగిలిపోయిన ఒత్తి, నూనెతో మళ్లీ వెలిగించకూడదట.