ఇంట్లో తాబేలు బొమ్మ ఉంటే మంచిదా? ఎలాంటి శుభాలు కలుగుతాయి?
Tortoise: మీరు గమనించి ఉంటే కొందరి ఇళ్లల్లో, షాపుల్లో తాబేలు బొమ్మ నీటిలో పెట్టి ఉంటుంది. చైనీస్ సంప్రదాయం అయిన ఫెంగ్ షుయ్‌లో ఈ తాబేలుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ తాబేలు బొమ్మ ఇంట్లో ఉంటే ఎంతో మంచిదట. అసలు ఎలాంటి తాబేలుని పెట్టుకోవాలి.. దీని వల్ల కలిగే ప్రయోజనాలేంటో తెలుసుకుందాం.
*ఇంట్లో తాబేలు బొమ్మని పెట్టుకోవాలనుకునేవారు గాజు లేదా క్రిస్టల్ బొమ్మను తెచ్చి పెట్టుకుంటే మంచిది. ఈశాన్యం, లేదా నైరుతి దిక్కుల్లో ఈ బొమ్మను పెట్టుకోండి.
*వ్యాపారంలో మెరుగైన లాభాలు రావాలంటే నల్ల తాబేలు బొమ్మని తెచ్చి మీ ఇంట్లో ఉత్తరం దిక్కున పెట్టుకోండి.
*లోహాలతో తయారుచేసిన తాబేలు బొమ్మలను ఉత్తరం లేదా వాయువ్య దిశల్లో పెట్టుకుంటే మంచిది.
*తాబేలు బొమ్మలపై ఫెంగ్ షుయ్ నాణేలు పెట్టిన బొమ్మలు కూడా లభిస్తాయి. ఇవి ఇంట్లో పెట్టుకోవడం ద్వారా ఆర్ధికంగా లాభాలు చేకూరతాయని అంటారు.
*చెక్కతో చేసిన తాబేలు బొమ్మను ఇంట్లోని తూర్పు లేదా దక్షిణ దిక్కుల్లో ఉంచితే మంచిది.
లాభాలేంటి?
*నిద్రలేమితో బాధపడేవారు ఈ తాబేలు బొమ్మను బెడ్‌రూంలో పెట్టుకుంటే ఆ సమస్య దూరమవుతుంది.
*సంపదను పెరిగేలా చేస్తుంది. ప్రశాంతతను ఇస్తుంది.
*తాబేలు అత్యధిక సంవత్సరాల పాటు బతికే జీవి. ఇది ఇంట్లో ఉంటే ఆయుష్షు పెరుగుతుందని భావిస్తారు.
*ఇంట్లో నెగిటివ్ ఎనర్జీలు ఉంటే పోతాయి.
*ఆడ తాబేలు బొమ్మలు ఇంట్లో ఉంటే సంతానలేమి సమస్యలు దూరం అవుతాయి.