Lord Ganesh: ఏ రాశివారు ఎలా పూజించాలి?

విఘ్నాల‌ను తొల‌గించే వినాయ‌కుడంటే అంద‌రికీ ఇష్ట‌మే (lord ganesh). ఏ ప‌ని ప్రారంభించినా ఏ పూజ మొద‌లుపెట్టినా ముందు ఆయ‌న్ను పూజించాల్సిందే. ఈ నెల 18న చాలా మంది వినాయ‌క చ‌వితిని జ‌రుపుకున్నారు. 19న కూడా చ‌వితి తిథి కొన‌సాగుతుండ‌డంతో కొంద‌రు ఈరోజున సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అయితే 12 రాశుల వారు వినాయ‌కుడిని ఏ విధంగా పూజిస్తే మంచి జ‌రుగుతుందో తెలుసుకుందాం.

మేష రాశి

మేష రాశి వారు వినాయ‌కుడికి బెల్లాన్ని ప్ర‌సాదంగా పెడితే ఎంతో మంచిద‌ట‌

వృష‌భ రాశి

వృష‌భ రాశిలో పుట్టిన‌వారు ఎప్పుడూ సిద్ధి వినాయ‌కుడిని పూజించాలి. రోజూ సిద్ధి వినాయ‌కుడికి చెక్క‌ర‌తో చేసిన ప్ర‌సాదాల‌ను నైవేద్యంగా పెట్టాలి. (lord ganesh)

మిథున రాశి

మిథున రాశి వారు గ‌ణ‌నాథుడితో పాటు ల‌క్ష్మీ దేవిని పూజిస్తే ఎంతో మంచిది. ఈ రాశి వారు నైవేద్యంగా ల‌డ్డూలు పెడితే అంతా మంచే జరుగుతుంది.

క‌ర్కాట‌క రాశి

ఈ రాశిలో జ‌న్మించిన వారు గ‌ణ‌నాథుడిని వ‌క్ర‌తుండ ఆకారంలో ఉంటేనే పూజించాలి. పూలు, గంధం తిల‌కాల‌తో ఆయన్ను పూజిస్తే ఎంతో మంచిది.

సింహ రాశి

సింహ రాశిలో పుట్టిన‌వారు వినాయ‌కుడితో పాటు ల‌క్ష్మీదేవిని పూజిస్తూ.. మోతిచూర్ ల‌డ్డూల‌ను ప్ర‌సాదంగా పెట్టాలి. (lord ganesh)

క‌న్యా రాశి

క‌న్యా రాశిలో పుట్టిన వారు వినాయ‌కుడికి, ల‌క్ష్మీదేవికి పూజించాలి. 21 ర‌కాల ప‌త్రితో పూజిస్తే మరింత మంచిది.

తుల రాశి

ఈ రాశిలో పుట్టిన వ‌క్ర‌తుండ వినాయ‌కుడిని పూజించాలి. ఐదు కొబ్బ‌రికాయ‌ల‌ను కొడితే మంచిది.

వృశ్చిక రాశి

వీరు ఓం భ‌గ‌వ‌తే గ‌జాన‌నాయ అనే మంత్రాన్ని జ‌పిస్తే ఎంతో మంచిది. శ్వేతార్క గ‌ణ‌నాథుడిని పూజించి ఎర్ర‌టి పూల‌తో అలంక‌రిస్తే అన్ని స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి.

ధ‌న‌స్సు రాశి

ఈ రాశి వారు కూడా శ్వేతార్క గ‌ణ‌నాథుడిని పూజిస్తూ ఓం న‌మో భ‌గ‌వ‌తే గ‌జాన‌నాయ అనే మంత్రాన్ని జపించాలి. (lord ganesh)

మ‌క‌ర రాశి

ఈ రాశివారు శ‌క్తి వినాయ‌కుడిని పూజించాలి. త‌మ‌ల‌పాకులు, వ‌క్క‌లు, యాల‌క‌లు, ల‌వంగాలు స‌మ‌ర్పిస్తే ఎంతో మంచిది.

కుంభ రాశి

కుంభ రాశి వారు కూడా శ‌క్తి వినాయ‌కుడిని పూజించాలి. ఎర్ర‌టి పూల‌తో పూజించి సున్నుండ‌లు స‌మ‌ర్పిస్తే మంచిది.

మీన రాశి

ఈ రాశిలో పుట్టిన వారు హ‌రిద్ర గ‌ణ‌నాథుడిని పూజించాలి. పూజించేట‌ప్పుడు కుంకుమ‌, తేనెను స‌మ‌ర్పించాలి.