Lord Shiva: ఈ శివాలయంలో నెయ్యి వెన్నగా మారిపోతుందట!
Hyderabad: మన దేశంలో ఎన్నో ప్రసిద్ధిగాంచిన శివాలయాలు (lord shiva) ఉన్నాయి. వాటిలో ఏది ప్రత్యేకం అంటే చెప్పడం కష్టమే. అయితే ఈ శివాలయంలో (shiva temple) మాత్రం ఓ వింత జరుగుతుందట. లింగానికి నెయ్యితో అభిషేకం చేసినప్పుడల్లా అది క్షణాల్లో వెన్నెగా మారిపోతుందని అంటున్నారు భక్తులు. మరి ఆ ఆలయం ఎక్కడుందో తెలుసుకుందాం. (lord shiva)
కర్ణాటకలోని (karnataka) దొబ్బాస్‌పేట అనే ప్రాంతంలో ఉంది ఈ శివాలయం. ఆలయం పేరు శివగంగే (shivagange). ఈ ఆలయంలోని లింగానికి నెయ్యితో అభిషేకం చేసినప్పుడల్లా అది వెన్నగా మారిపోతూ ఉంటుందట. దాదాపు 1600 సంవత్సరాలుగా ఇలా జరుగుతోందని భక్తులు అంటున్నారు. ఆ వెన్నను ప్రసాదంలా తీసుకుంటే సర్వ రోగాలు నయం అవుతాయని, అందులో ఔషద గుణాలు ఉంటాయని వారి నమ్మకం. అందుకే ఈ ఆలయానికి (lord shiva) వచ్చిన వారంతా ఆ వెన్నను ఇంటికి తీసుకెళ్లకుండా ఉండరు. ఈ శివగంగే ఆలయం సముద్ర మట్టానికి 4,559 అడుగుల ఎత్తులో ఉంటుంది. ఇక్కడ ఓ పర్వతం శివ లింగం ఆకారంలో పక్కనే గంగ కూడా ఉన్నట్లు కనిపిస్తుందట.