Spiritual: ధూపం ఇలా వేస్తే పట్టిందల్లా బంగారమే
Spiritual: ఈరోజుల్లో రోడ్లపై ఎక్కడ చూసినా చెత్త, ఉమ్ములు, వాడి పారేసిన నిమ్మకాయలు, గుడ్డ ముక్కలు కనిపిస్తూ ఉంటాయి. మనం తెలిసో తెలీక తొక్కడమో వాహనాలను వాటిపై ఎక్కించడమో చేస్తుంటాం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా రోజులో ఏదో ఒక తొక్కకూడని దాన్ని తొక్కేస్తుంటాం. బయట అంతా తిరిగేసి అలాగే ఇళ్లకు వెళ్లిపోతున్నాం. మహా అంటే ఇంటికి వెళ్లి స్నానం చేస్తున్నాం కానీ ఇంటి బయటే కాళ్లు కడుక్కుని లోపలికి వెళ్లే సంప్రదాయాన్ని దాదాపు చాలా మంది మర్చిపోయారనే చెప్పాలి. దాని వల్ల మనకు తెలీకుండానే ఇంట్లో దరిద్రాలు దాపరిస్తుంటాయి.
దాని ఫలితంగానే ఇంట్లో ఎప్పుడూ ఏడుపులు, గొడవలు, అలకలు, అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. మరి ఇలాంటప్పుడు ఏం చేయాలి? ఇంట్లో రెండు పూటలా అంటే ఉదయం సాయంత్రం తప్పనిసరిగా ధూపం వేస్తుండాలి. బొగ్గు తెచ్చుకుని రోజూ ఉదయం సాయంత్రం మూడు బొగ్గు ముక్కలను కాల్చి వాటిపై సాంబ్రాణి చల్లుతూ ఇంట్లోని నలుమూలలా ధూపం వేస్తూ ఉండాలి. ఇలా ప్రతి రోజూ క్రమం తప్పకుండా చేస్తుంటే ఆ ఇంట్లో జరిగే మార్పులు మనకే తెలుస్తాయట. ధూపానికి అంత శక్తి ఉందని పెద్దలు చెప్తుంటారు.