వేసవిలో ఇవి తింటే ఆరోగ్యం మీ వెంటే!
వేసవిలో తీసుకునే ఆహారం పట్ల శ్రద్ధ తీసుకోవడం చాలా అవసరం. పెరిగే ఉష్ణోగ్రతల కారణంగా శరీరం నుంచి చెమట రూపంలో ఎక్కువగా నీరు విసర్జన కావడంతో నీరసం వచ్చేస్తుంది. దీన్ని అధిగమించేందుకు ఎక్కువగా ద్రవహారం తీసుకోవాలి. వీటి వల్ల విటమిన్లు సమృద్ధిగా అందుతాయి. జంక్ఫుడ్కి దూరంగా ఉంటూ జ్యూస్లు, పండ్లను రోజూవారి ఆహారంలో జతచేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. వేసవిలో తీసుకోవాల్సిన ఆహార పదార్థాలేంటో చూద్దాం..
మజ్జిగ: వేసవికాలంలో తీసుకోవాల్సిన బెస్ట్ ఫుడ్స్‌లో మజ్జిగ ఒకటి. రోజులో తగినంత ఎక్కువ సార్లు మజ్జిగ తాగుతుండటం వల్ల శరీరానికి చల్లదనం అందుతుంది. అంతేకాదు… శరీరంలో బ్యాక్టీరియాను నాశనం చేసి, సాధారణ జలుబు, దగ్గును నివారించేందుకు మజ్జిగ దోహదం చేస్తుంది.
పుదీనా: ఇదొక హెల్దీ హెర్బ్. పెరుగులో కొద్దిగా పుదీనా చేర్చి రైతాను తయారుచేసుకోవచ్చు . పుదీనాతో మంచి ఫ్లేవరబుల్ చట్నీలు చేసుకోవచ్చు . ఇది వేసవిలో బాడీ టెంపరేచర్‌ను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.
ఉల్లిపాయలు: ఉల్లిపాయలో చలువ చేసే లక్షణాలు ఎక్కువగా ఉంటాయి . అందుకే వీటిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. కర్రీస్, సలాడ్స్, రైతాలు, చట్నీస్‌లో చేర్చుకోవడం వల్ల మీ శరీరాన్ని చల్లగా మార్చుతుంది .ఎర్ర ఉల్లిపాయల్లో క్విర్సిటిన్ పుష్కలంగా ఉంటుంది. ఇది ఒక నేచురల్ యాంటీ అలర్జిన్ . వడదెబ్బ నుంచి రక్షణ కల్పిస్తుంది.
పుచ్చకాయ: వేసవిలో తీసుకోవాల్సిన ఆహారాల్లో మరో బెస్ట్ ఫుడ్ పుచ్చకాయ. ఈ రెడ్ కలర్ జ్యూస్ ఫ్రూట్ లో 90శాతం నీళ్లు, 10శాతం ఫ్లెష్ ఉంటుంది . వేసవిలో ఈ పండు తినడం వల్ల మీ శరీరాన్ని పూర్తిగా హైడ్రేషన్‌లో ఉంచుతుంది.
కర్బూజా: వేసవికి మరో బెస్ట్ ఫుడ్ మస్క్ మెలోన్ (కర్బూజా). వేసవిలో డైలీ డైట్‌లో తప్పనిసరిగా చేర్చుకోవాల్సిన మరో ఆహారం ఇది. ఇందులో ఉండే వాటర్ కంటెంట్ మీకు చెమట పట్టకుండా నివారిస్తుంది.
జామకాయ: జామకాయలో విటమిన్ ‘సీ’ పుష్కలంగా ఉంటుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కూడా ఉంటాయి. ఇవి వేసవిలో ఆరోగ్యంగానూ, శక్తిమంతం గానూ ఉంచు తాయి. జామకాయలో ఉండే ప్రోటీన్లు ఎక్కువ శక్తిని అందిస్తాయి.
కొబ్బరి నీళ్లు: వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచడానికి కొబ్బరి నీళ్లు బాగా పనిచేస్తాయి. అధిక ఉష్ణోగ్రత వల్ల కలిగే చర్మ రుగ్మతలను పారదోలడమే కాకుండా శరీరంలోని టాక్సిన్స్‌ను నివారిస్తాయి.
నిమ్మకాయ: శరీరంలోని విషాలను బయటకు పంపిస్తుంది. చర్మాన్ని హైడ్రేట్ చేయడానికి సహాయపడుతుంది.
కీరా: కీరదోసకాయలో ఆరోగ్యానికి కావాల్సిన పోషక విలువలు సమృద్ధిగా లభ్యమ వుతాయి. వేసవిలో ఈ కాయను తీసుకోవడం చాలా శ్రేష్టం. దీనిని సలాడ్‌గా తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సినంత తేమ అంది జీర్ణ వ్యవస్థను క్రమబద్ధం చేస్తుంది.
ఫైనాపిల్: ఇందులో నీటితో కూడిన యాంటి ఆక్సిడెంట్స్, ఫైబర్ అధికంగా ఉం టుంది. కాబట్టి ఫైనాపిల్ తరచూ తీసు కోవడం ఉత్తమం. ఇందులో విటమిన్స్, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి.