కుక్క‌లంటే భ‌య‌మా? వాస్తు శాస్త్రం ఏం చెప్తోంది?

Dogs: కుక్క‌లంటే ఇష్ట‌ప‌డే వారు ఉంటారు. వాటిని చూడ‌గానే ప‌రుగులు పెట్టేవారూ ఉంటారు. మ‌నుషులు వాటిని చంపుతున్న ఘ‌ట‌న‌లతో పాటు.. కుక్క‌లు కూడా మ‌నుషుల‌పై ప‌డి దాడులు చేయ‌డం వంటి ఘ‌ట‌న‌ల‌ను కూడా చూస్తున్నాం. అయితే ఓ మ‌నిషి కుక్క‌కు భ‌య‌ప‌డుతున్నా.. లేదా కుక్క ఆ మనిషిని చూసి అరుస్తున్నా కూడా దాని వెనుక ఓ కార‌ణం ఉంద‌ని అంటున్నారు ప్ర‌ముఖ వాస్తు శాస్త్ర నిపుణులు శృతి ఖ‌ర్మంద‌.

శున‌కాలు శ‌ని, రాహువుల‌కు సంబంధించిన‌వి. ఒక వ్య‌క్తి జాత‌కంలో రాహువు మంచి చేస్తున్నాడంటే అత‌నికి ఎలాంటి జాత‌క దోషాలు లేవు అని అర్థం. కాక‌పోతే కొన్ని సంద‌ర్భాల్లో వాస్తు బాగానే ఉన్నా కూడా దోషాలు వెంటాడుతుంటాయి. అలాంటి సమయంలోనే జంతువులు వెంట‌ప‌డుతుంటాయ‌ట‌. న‌ల్ల శున‌కాలు శ‌ని గ్రహానికి సంబంధించిన‌వి. గోధుమ రంగు శున‌కాలు రాహువుకు సంబంధించిన‌వి. కుక్క‌ల‌పై న‌లుపు, తెలుపు మ‌చ్చ‌లు ఉంటే అవి కేతువుకు సంబంధించ‌న‌వి అని చెప్తున్నారు శృతి. ఒక‌వేళ జాత‌కంలో శ‌ని ప్ర‌భావం తీవ్రంగా ఉంటే వారు న‌ల్ల శున‌కానికి అన్నం పెడితే ఆ దోషం పోతుంది. రాహు – కేతు స‌మ‌స్య‌లు ఉంటే గోధుమ రంగు, తెలుపు న‌లుపు మ‌చ్చలు క‌లిగిన శున‌కాల‌కు అన్నం పెడితే ఆ దోషాలు కూడా పోతాయని చెప్తున్నారు.

ALSO READ: Spiritual: మ‌తం మారితే ఏం జ‌రుగుతుంది?