వాస్తు ప్రకారం వాచీలు ఎలా పెట్టుకోవాలి?
Vastu: చేతికి పెట్టుకునే వాచీలు కూడా వాస్తు ప్రకారం కొన్ని నియమాలను అనుసరించి పెట్టుకోవాలని అంటున్నారు వాస్తు శాస్త్ర నిపుణులు. ఇలా చేస్తే మంచి ఫలితాలు పొందుతారట. అసలు వాస్తు ప్రకారం వాచీలు ఎలా ధరించాలో తెలుసుకుందాం.
*మీరు పెట్టుకునే వాచీలో సమయాన్ని సూచించే ముల్లులు పెద్దగా ఉండకూడదు. ఆ ముల్లులు పెద్దగా ఉండటం వల్ల పర్సనల్‌గా ప్రొఫెషనల్‌గా సమస్యలు వస్తాయని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు. అలాగని మరీ చిన్న ముల్లులు ఉన్న వాచీ కూడా పెట్టుకోకూడదు. మీడియం సైజులో ఉండేవాటిని ఎంచుకోండి.
*ఏ చేతికి వాచీ పెట్టుకోవాలి అని చాలా మందికి ఉండే సందేహం. సాధారణంగా వాచీని ఎడమ చేతికే పెట్టుకుంటారు. కొంతమంది స్టైలిష్‌గా ఉండాలని కుడి చేతికి పెట్టుకుంటారు. ఈ విషయంలో ఎలాంటి వాస్తు నియమాలు లేవు. ఏ చేతికైనా పెట్టుకోవచ్చు.
*మీ వాచీ స్ట్రాప్ ఎప్పుడూ కూడా లూజ్‌గా ఉండకూడదు. చేతికి సరిగ్గా సరిపోయేది ఎంచుకుంటే మంచిది. మీరు పెట్టుకునే వాచీ ఎముకకు తగిలేలా అస్సలు పెట్టుకోకూడదు. దీని వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయి.
*ఇక ఇప్పుడు మార్కెట్లో ఎన్నో రకాల రంగు రంగుల వాచీలు లభిస్తున్నాయి. ఆ రంగుల వాచీల బదులు సిల్వర్, గోల్డ్ రంగుల వాచీలు పెట్టుకుంటే మంచిది.