Tulasi మొక్కను తిరిగి బతికించవచ్చా?
గుమ్మం ముందు తులసి (tulasi) మొక్క అందరి ఇళ్లల్లోనూ దర్శనం ఇస్తుంది. అయితే కొన్ని సందర్భాల్లో తులసి మొక్క చనిపోతుంటుంది. దానిని తీసి పారేసి కొత్తది నాటుకుంటూ ఉంటారు. ఇంకొందరైతే ఏదో కీడు జరిగిపోతుందేమో అని భయపడుతుంటారు. అయితే చనిపోయిన తులసి మొక్కను తిరిగి బతికించుకోవచ్చట. అదెలాగో తెలుసుకుందాం.
*తులసి మొక్కకు ఉండే కొమ్మలు ఇంకా పచ్చగా ఉందో లేదో చూడండి. దానికి ఉండే గింజలు ఎండిపోయాయేమో కూడా చెక్ చేయండి. ఒకవేళ ఎండిపోయిన గింజలు ఉంటే వెంటనే వాటిని తీసి వేరే కుండీలో వేస్తే మరో మొక్క కొద్దిరోజుల్లోనే వచ్చేస్తుంది.
*రెండు రోజులకోసారి నీళ్లు పోస్తూ ఉండాలి. ఆకులు కిందకి వేలాడుతుంటే నీరు లేక అల్లాడిపోతోందని అర్థం. వెంటనే ఒక రెండు మూడు మగ్గులతో నీళ్లు పోస్తే ఒక గంటలో ఆకులు చక్కగా విచ్చుకుంటాయి. (tulasi)
*ఒకవేళ మొక్క చచ్చిపోయేలా ఉంది అని మీకు అనిపిస్తే వెంటనే మట్టిని తీసేసి కొత్త ఎర్రమట్టిని వేసి కాస్త నీళ్లుపోయండి.
*తులసి మొక్కకు రోజుకు 6 నుంచి 8 గంటల పాటు సూర్య కిరణాలు తగులుతూ ఉండాలి. అప్పుడే మొక్క బాగుంటుంది.
*తులసి మొక్కను పూజిస్తున్నప్పుడు దీపం పెట్టి అగరబత్తిని వెలిగించి కుండీలోని మట్టిలోనే గుచ్చిపెడుతుంటారు. ఆ పొగ మొక్కకు తగిలితే పాడైపోతుంది. అగరబత్తీని కాస్త దూరంగా పెడితే మంచిది. (tulasi)
*ఆకులు పసుపు రంగులో ఉంటే వెంటనే ఆకులను మాత్రమే తుంచేయండి. మొక్కను ఓపికతో జాగ్రత్తగా చూసుకుంటేనే బాగుంటుంది.