Spiritual: జాతక దోషాలు ఎలా పోతాయి? ఏం చేయాలి?
Spiritual: చాలా మంది జాతక చక్రంలో దోషాలు ఉంటాయి. వాటిని తొలగించేందుకు జ్యోతిష్యం చెప్పేవారి దగ్గరికి వెళ్లి వేలకు వేలు పోసి పూజలు చేయించుకుంటూ ఉంటారు. కొందరికి ఫలితాన్ని ఇస్తాయి. కొందరు వారి చేతుల్లో మోస పోతుంటారు. ఇలా కాకుండా మనం ఇంట్లో చదువుకునే మంత్రాలు, చేసే పూజలతో దోషాలు పోతాయా? కచ్చితంగా పోతాయి. మరి దోషాలు పోవాలంటే ఏం చేయాలి? చక్కగా ఇంట్లో కూర్చుని నిష్ఠగా విష్ణు సహస్ర పారాయణం చేస్తే చాలు. ఏ దోషాలు ఉన్నా తొలగిపోతాయని నిపుణులు చెప్తున్నారు.
విష్ణు సహస్రనామాలకు గ్రహ దోషాలను, జాతకంలో దోషాలను నివారించే శక్తి ఉంది. ప్రతి రోజూ పొద్దున 6 గంటలకు సాయంత్రం 6 గంటలకు నియమం తప్పకుండా విష్ణు సహస్రనామం చేస్తే ఎలాంటి గ్రహ దోషం ఉన్నా కూడా ఏ శాంతి చేయకుండా ఆ దోషం ఎగిరిపోతుంది. ఒకవేళ ఉదయం 6 గంటలకు కుదరకపోతే.. వేరే సమయంలో కూడా చేయొచ్చు. ఇలా ప్రతి రోజూ అదే సమయానికి చేస్తూ ఉండాలి. ఉదయం 6 గంటలకు చేస్తే ప్రదోష వేళ కాబట్టి ప్రకృతిలో గొప్ప శక్తి ఉంటుంది. అప్పుడు చేస్తే ఆ శక్తిని మనం పట్టుకోవచ్చు అని 6 గంటలకు చేయమని చెప్తారు. ఆ సమయంలో కాకపోతే మీకు వీలున్న సమయంలో చేసుకోండి. కానీ అదే సమయానికి క్రమం తప్పకుండా చేయాలి. (Spiritual)
ఎలా పనిచేస్తుంది?
జాతకం రాశులను బట్టి ఉంటుంది. ఈ రాశులన్నీ నక్షత్రాలను బట్టి ఉంటాయి. ఎన్ని నక్షత్రాలు ఉన్నాయి? 27 నక్షత్రాలు ఉన్నాయి. ఈ 27 నక్షత్రాలు కూడా ప్రతి నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి. 27 నక్షత్రాలు 4 పాదాలను మల్టిప్లై చేస్తే 108 వస్తుంది. విష్ణు సహస్ర నామంలోనూ 108 నామాలు ఉన్నాయి.
ఉదాహరణకు… మీరు భరణి నక్షత్రంలో రెండో పాదంలో పుడితే.. దానికి ఈక్వేషన్ కాలిక్యులేట్ చేసి చూడండి. అంటే.. అశ్వినికి నాలుగు తీసేయండి. భరణిలో ఒకటో పాదం ఐదో శ్లోకం తీసేయండి. భరణి రెండో పాదంలో పుడితే విష్ణు సహస్ర నామంలో ఆరో శ్లోకం మీకు సంబంధించిన గ్రహాలన్నింటికీ శాంతి చేయడానికి ఉపయోగపడుతుంది. అలా ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టారో చూసి దానిని కాలిక్యులేట్ చేసుకుంటే విష్ణు సహస్ర నామంలో ఏ శ్లోకం మీకు మంత్రంలా పనికొస్తుందో తెలుస్తుంది.
అయితే మీ జాతక దోషానికి సంబంధించిన శ్లోకాన్ని మాత్రమే చదవడం కంటే విష్ణు సహస్ర నామం మొత్తం చదవడం బెటర్. కేవలం 20 నిమిషాలు పడుతుంది. మీ బాధలన్నీ తొలగిపోతాయి.