Anjaneya స్వామికి వ్ర‌తం ఎలా చేయాలి?

Hyderabad: మంగ‌ళ‌వారం రోజున ఆంజ‌నేయ స్వామికి (anjaneya) వ్ర‌తం ఎలా చేయాలి? ఉప‌వాసం ఎలా చేయాలి? దాని వ‌ల్ల క‌లిగే లాభాలేంటో తెలుసుకుందాం. ఆంజ‌నేయ స్వామికి ఎవ్వ‌రైనా వ్ర‌తం చేసి ఉప‌వాసం ఉండొచ్చు. మ‌గ‌వారే చేయాల‌న్న నియ‌మం ఏమీ లేదు. కుజుడు బ‌ల‌హీన ప్ర‌భావం ఉన్న వారెవ‌రైనా ఆంజ‌నేయ స్వామికి ప్ర‌తి మంగళ‌వారం వ్ర‌తం నోచుకుని ఉప‌వాసం ఉండొచ్చు. మంగ‌ళవారాల్లో ఉప‌వాసం చేస్తే శ‌త్రుపీడ, అప్పులు, అనారోగ్య స‌మ‌స్య‌లు, నిరుద్యోగ బాధ‌లు అన్నీ తొలగిపోతాయి. మంగ‌ళ‌వారం అనేది మంగ‌ళ దేవుడు (కుజుడు)కి సంబంధించిన‌ది కాబ‌ట్టి ఉప‌వాసం చేస్తే ఆయ‌న శాంతించి అపార‌మైన ధ‌నాన్ని, సంతోషాన్ని క‌లిగిస్తాడ‌ని శాస్త్రాలు చెబుతున్నాయి. (anjaneya)

మంగ‌ళ‌వారం ఉప‌వాసం వ‌ల్ల క‌లిగే మ‌రిన్ని లాభాలు

*పిల్ల‌లు లేని వారు ప్ర‌తి మంగ‌ళ‌వారం ఉప‌వాసం చేస్తే త్వ‌ర‌లో సంతాన సాఫ‌ల్య‌త క‌లుగుతుంద‌ని భ‌క్తుల నమ్మ‌కం. భార్యాభ‌ర్తలు ఇద్ద‌రూ ఆంజనేయ‌స్వామిని పూజించి ఆరోజంతా ఉప‌వాసం ఉంటే కోరిక నెరవేరుస్తార‌ట‌.

*ఆంజ‌నేయుడు అంటేనే ధైర్యానికి, భ‌క్తికి, గౌర‌వానికి ప్ర‌తీక‌. ఆయ‌న్ను పూజిస్తే స‌మాజంలో అవి మ‌న‌కూ ల‌భిస్తాయి.

*చేత‌బడికి గురైన వారికి, దెయ్యాలు క‌నిపిస్తున్నాయంటూ నిద్ర‌పోకుండా అను క్ష‌ణం భ‌య‌ప‌డేవారి చేత ప్ర‌తి మంగ‌ళ‌వారం వ్ర‌తం చేయిస్తే ఆ స‌మ‌స్య‌లు తొల‌గిపోతాయి. (anjaneya)

ఎలా చేయాలి?

*వ్ర‌తం చేయాల‌నుకునేవారు ఉద‌యాన్నే లేచి స్నానం చేసి ఎరుపు రంగు దుస్తులు వేసుకుని ఆంజ‌నేయ స్వామిని పూజించాలి.

*ఈశాన్య దిశ‌గా ఆంజ‌నేయ స్వామి ఫొటోను కానీ విగ్ర‌హాన్ని కానీ ఉంచి పూజించండి.

*నెయ్యితో దీపం వెలిగించి పూల మాల‌లు వేయండి. ఆ పూల మాల‌ల‌పై కాస్త కుంకుమ‌, తులసి ఆకులు కూడా వేసి ఉంచాలి.  (anjaneya)

*మంగ‌ళ‌వార వ్ర‌త క‌థ‌, సుంద‌రాకాండ‌, హ‌నుమాన్ చాలీసా త‌ప్ప‌క చ‌ద‌వాలి.

*ఆ తర్వాత ద‌గ్గ‌ర్లోని హ‌నుమాన్ ఆల‌యానికి వెళ్లి ఎర్ర వ‌స్త్రం, మ‌ల్లెపూల నూనె, సింధూరం, బూంది ప్ర‌సాదంగా పంచిపెట్టండి.

*ఉప‌వాసం చేయాల‌నుకుంటే ఒక పూట తిని ఉండచ్చు. కానీ రోజంతా నిష్ఠ‌గా బ్ర‌హ్మ‌చారిగా ఉండాలి. (anjaneya)