Higher pension scheme: ఎవ‌రికి.. ఎలా..?

Hyderabad: ఈపీఎస్(eps) కింద అధిక‌ పెన్ష‌న్ స్కీంకు(higher pension scheme) అప్లై చేసుకునే వెసులుబాటు క‌ల్పించింది కేంద్ర ప్ర‌భుత్వం. దీనికి చివ‌రి తేదీ జూన్ 26. ఇది అప్లై చేసుకోవ‌డానికి ఐదు నిమిషాలే ప‌డుతుంది. ఈ అధిక‌ పెన్ష‌న్ ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే ఈపీఎఫ్‌లో బ్యాలెన్స్ త‌గ్గుతుంది..పెన్ష‌న్ బ్యాలెన్స్ పెరుగుతుంది. అస‌లు ఈ అధిక పెన్ష‌న్ ఏంటో.. ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం. ప్ర‌తి EPFO స‌భ్యుడికి రెండు ఖాతాలు ఉంటాయి. ఒక‌టి ఈపీఎస్(employee pension scheme), మ‌రొక‌టి ఈపీఎఫ్‌(employee provident fund). ప్ర‌తి నెలా ఉద్యోగికి వ‌చ్చే సాల‌రీ నుంచి 12% EPFOలో ప‌డుతుంది. అందులో 8.33% ఈపీఎఫ్‌లో .. 3.67% ఈపీఎస్‌లో ప‌డుతుంది.

ఇప్పుడు అధిక పెన్ష‌న్ ఆప్ష‌న్ ఎంచుకున్న‌ట్లైతే.. మీ సాల‌రీలో ఎలాంటి మార్పులు ఉండ‌వు కానీ.. మీరు ఈపీఎస్‌లో వేసే డ‌బ్బులోనే డిఫ‌రెన్స్ ఉంటుంది. అంటే ఇప్పుడు మీ సాల‌రీ నెల‌కు రూ.20,000 అనుకోండి.. ఇందులో నుంచి రూ.2,400 మీ పీఎఫ్‌లో ప‌డుతుంది. కంపెనీ కూడా మ‌రో రూ.2,400 పీఎఫ్‌లో వేస్తుంది. కానీ కేంద్రం తెచ్చిన కొత్త రూల్ ప్ర‌కారం.. ఆ రూ.2,400లో నుంచి రూ.1,660 ఈపీఎస్‌లో ప‌డితే.. మిగ‌తా రూ. 740 మీ పీఎఫ్‌లో ఖాతాలో ప‌డుతుంది. ఇప్ప‌టివ‌ర‌కు రూ.15,000 సాల‌రీ ఉన్న‌వారికి ఈపీఎస్‌లో 1,249.50 జ‌మ అవుతోంది. మిగ‌తా మొత్తం ఈపీఎఫ్‌లో ప‌డుతోంది.

మీరు ఈ అధిక పెన్ష‌న్ విధానాన్ని ఎంచుకోవాలనుకుంటే.. మీ కంపెనీ హెచ్ ఆర్‌తో మాట్లాడి మార్పులు చేసుకోవ‌చ్చు. లేదా మీరే ఈపీఎఫ్ ఓ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మార్చుకోవ‌చ్చు. ఈ అధిక పెన్ష‌న్ స్కీం రిటైర్ అయిన వారికి కూడా వ‌ర్తిస్తుంది. ఈపీఎఫ్ ఖాతాలో ఇప్ప‌టివ‌ర‌కు జ‌మ అయిన మొత్తాన్ని వ‌డ్డీతో క‌లిపి ఈపీఎస్ ఖాతాలోకి మార్పించుకుంటే అధిక పెన్ష‌న్ లభించే అవ‌కాశం ఉంది.