Spiritual: అయోధ్యలో ఆలయం.. పార్వతి దేవే సీతమ్మవారు..!
Spiritual: శివుడి భార్య పార్వతి దేవి అని రాముడి భార్య సీతమ్మ అని అందరికీ తెలిసిందే. అయితే ఈ ఆలయంలో మాత్రం పార్వతి దేవినే సీతమ్మవారిగా కొలుస్తారు. ఈ ఆలయం విశేషాలేంటో తెలుసుకుందాం. ఈ ఆలయం పేరు చోటీ దేవకాళీ మందిర్. ఇది ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్యలో ఉంది. ఇది ప్రధాన సిద్ధ శక్తి పీఠం. సీతమ్మవారి కోసం దశరథ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెప్తున్నారు. ఇక్కడి అమ్మవారు భక్తులు కోరిన కోర్కెలన్నీ తీరుస్తారని విశ్వసిస్తారు.
అయోధ్యలో తన అత్తగారింట్లో ఉండేందుకు సీతమ్మ పార్వతి దేవి విగ్రహాన్ని తనతో పాటు తీసుకెళ్లిందట. అయోధ్యలోని సప్తసాగర ఈశాన్య మూలాన సీతమ్మ కోసం దశరథ మహారాజు ఈ ఆలయాన్ని నిర్మించారు. పార్వతి దేవి గౌరీ దేవి అవతారం ఎత్తినప్పటి నుంచి సీతమ్మవారు ఆమెను పూజిస్తూ వస్తున్నారట. ఇక్కడ భక్తితో ఏ కోరిక కోరినా తప్పకుండా నెరవేరుతుందని భక్తుల నమ్మకం. మొఘలుల పాలన సమయంలో ఈ ఆలయాన్ని రెండు సార్లు ధ్వంసం చేసారు. ఆ తర్వాత మహారాజ పుష్యమిత్ర మళ్లీ పురాతన వైభవాన్ని తీసుకొచ్చారు.