అమ్మవారి రూపంలో కొలువైన ఆంజనేయస్వామి..!
Girijabandh Hanuman: ఆడదాని గాలిని కూడా తాకనివ్వని హనుమంతుడిని.. ఈ ఆలయంలో అమ్మవారి రూపంలో కొలుస్తారు. సాధారణంగా ఆంజనేయ స్వామిని అమ్మాయిలు దూరం నుంచే దండం పెట్టుకుంటారు కానీ విగ్రహాన్ని తాకాలని చూడరు. అసలు ఆడవారు ఆంజనేయుడి విగ్రహాన్ని ముట్టుకోకూడదు అని పెద్దలు అంటుంటారు. అలాంటి ఈ ఆలయంలో భజరంగ్‌ని ఎందుకు అమ్మవారి రూపంలో కొలుస్తారో తెలుసుకుందాం.
ఈ ఆలయం ఛత్తీస్‌గడ్‌లోని రతన్‌పూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయాన్ని గిరిజాబంద్ హనుమాన్ ఆలయం అని పిలుస్తారు. కొన్ని వందల ఏళ్ల క్రితం పృథ్వీ దేవ్జు అనే రాజు కుష్ఠు రోగంతో బాధపడుతుండేవాడట. ఆయనే ఈ ఆలయాన్ని నిర్మించినట్లు స్థానికులు చెప్తున్నారు. పృథ్వీకి కలలో ఆంజనేయుడు కనిపించి తనకు ఆలయం నిర్మించాలని కోరారట. ఆలయ కట్టడం ఇంకొన్ని రోజుల్లో పూర్తవుతుందనగా.. పృథ్వీకి హనుమంతుడు మళ్లీ కలలో కనిపించి మహామాయ కుంద్ నుంచి తన విగ్రహాన్ని తెప్పించి ప్రాణ ప్రతిష్ఠ చేయాలని చెప్పారట. పృథ్వీ మహామాయ కుంద్‌కి వెళ్లి చూడగా అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం అమ్మవారి రూపంలో ఉందట. ఆ విగ్రహాన్ని తీసుకొచ్చి తాను నిర్మించిన ఆలయంలో ప్రతిష్ఠించగా అతని కుష్ఠి రోగం పూర్తిగా నయమైపోయింది. (girijabandh hanuman)
ఈ ఆలయానికి వెళ్లడానికి అన్ని మార్గాలు ఉన్నాయి. ఆంజనేయ స్వామి అమ్మవారి రూపంలో ఉన్నారనేదే ఇక్కడి ప్రత్యేకత. అందుకే రోజూ వేలల్లో భక్తులు ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు.